కాంగ్రెస్ కు డూ ఆర్ డై !

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు( Assembly Elections In Telangana ) నేడు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ ఎన్నికల్లో విజయం కోసం మూడు ప్రధాన పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి.

ముఖ్యంగా ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి డూ ఆర్ డై లా మారాయి.

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే ( Congress Party ) అయినప్పటికి ఆ క్రెడిట్ కే‌సి‌ఆర్ కు వెళ్ళడంతో రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ హస్తం పార్టీకి నిరాశే ఎదురైంది.

ఇక ఈ ఎన్నికల్లో కూడా హస్తంపార్టీ ఓటమి మూటగట్టుకుంటే తెలంగాణలో ఆ పార్టీ పూర్తిగా బలహీనపడడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.

"""/" / పైగా సౌత్ లో కాంగ్రెస్ పుంజుకోవాలంటే తెలంగాణ ఎన్నికల్లో గెలవడం ఆ పార్టీకి అత్యంత కీలకం.

అందుకే గత కొన్నాళ్లుగా జాతీయ అగ్రనేతలందురూ కూడా తెలంగాణలో ఎడతెరిపి లేని ప్రచారాలు నిర్వహించారు.

అంతేకాకుండా కర్నాటకలో( Karnataka ) ఫాలో అయిన విన్నింగ్ స్ట్రాటజీని ఇక్కడ కూడా ఫాలో అయ్యారు.

కర్నాటకలో ఐదు గ్యారెంటీల మంత్రం జపిస్తే తెలంగాణలో ఆరు గ్యారెంటీల మంత్రం పటించారు.

బి‌ఆర్‌ఎస్ ను అన్నీ వైపులా ఇరకాటంలో పెట్టె విధంగా విశ్వ ప్రయత్నలు చేశారు హస్తంనేతలు.

ఇక నేటితో ఓటర్ల అభిప్రాయం తేటతెల్లం కానుంది.కాంగ్రెస్ పట్ల ప్రజలు ఎలాంటి భావనతో ఉన్నారో మరో రెండు రోజుల్లో బహిర్గతం కానుంది.

"""/" / ఇక ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే బి‌ఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల మద్య హోరాహోరీ పోరు ఖాయం అనే సంకేతాలే కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఇంటర్నల్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రజలు మరోసారి బి‌ఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ అనేది కొందరి అభిప్రాయం.

అదే గనుక జరిగితే హస్తం పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరించినట్లేనని చెప్పవచ్చు.ఇకపోతే తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఫలితాలు కూడా కాంగ్రెస్ కు అత్యంత కీలకం.

ఈ ఎన్నికల ఫలితాలను బట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం ఉండనుంది.మరి హస్తం పార్టీకి డూ ఆర్ డై గా మారిన ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఆ పార్టీకి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.

బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 17 ఏళ్లకే చైనీస్ అబ్బాయి మృతి..!