హామీల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ డ్రామాలు..: జగదీశ్ రెడ్డి
TeluguStop.com
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి( Jagadish Reddy ) విమర్శలు గుప్పించారు.
కేసులు, ఫేక్ న్యూస్ లు తప్ప కాంగ్రెస్ కు( Congress ) ఇంకోటి లేదని తెలిపారు.
పంటలు ఎండి రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టడం లేదని విమర్శించారు.ఫోన్ ట్యాపింగ్ లో( Phone Tapping ) ఏం తేల్చారో వాళ్లకే తెలియదని పేర్కొన్నారు.
రాజగోపాల్ రెడ్డి( Rajagopal Reddy ) ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు.
హామీల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు.రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కలిసి బీఆర్ఎస్ పై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ ను ఏమీ చేయలేరన్న జగదీశ్ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ కలిసి డమ్మీ అభ్యర్థులను పెట్టుకున్నారన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే ప్రజలకు ఉపయోగమని సూచించారు.
అంటార్కిటికాలోని ఎత్తైన శిఖరంపై జెండా పాతిన ఎన్ఆర్ఐ జంట