దళిత మహిళపై దాడి చేసిన సీఐని సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ ధర్నా

నల్లగొండ జిల్లా:దళిత మహిళపై దాడి చేసిన డిండి సీఐ పరుశురామ్ పై చర్యలు తీసుకోవాలని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్ డిమాండ్ చేశారు.

బుధవారం డిండి సీఐ పరుశురాం దళిత మహిళపై చేసిన దాడిని ఖండిస్తూ దేవరకొండ డిఎస్పి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో అయన పాల్గొని మాట్లాడుతూ దళిత మహిళలపై అనుచితంగా ప్రవర్తించి, ఆమెపై దాడి చేసిన సీఐ పరశురామును వెంటనే విధుల నుండి తొలగించి, చట్టపకారం తగు చర్యలు తీసుకోవాలన్నారు.

అధికార పార్టీకి పోలీసు అధికారులు తొత్తులుగా ప్రవర్తించడం తగదని,ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలి పెట్టని అన్నారు.

రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి,అధికారులు ప్రజలకు సేవలందించాలి కానీ,ఇలాంటి నీచమైన పని చేస్తే ప్రజలు క్షమించరాని అన్నారు.

ఇలాంటి పోలీసు అధికారుల పరిస్థితి రేపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎలా ఉంటుందో తెలుసుకోవాలని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కల్కి 2 తర్వాత నాగ్ అశ్విన్ ఆ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడా..?