నల్లగొండ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా

నల్లగొండ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా

నల్లగొండ జిల్లా:తెలంగాణ టీపీసీసీ పిలుపు మేరకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట జిల్లా కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ధర్నా నిర్వహించింది.

నల్లగొండ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా

ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లుగా లేదని విమర్శించారు.

నల్లగొండ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా

రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చి చిన్న,సన్నకారు రైతులకు తీరని అన్యాయం చేసిందని, ధరణి వలన దాదాపు 12లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని పరిష్కరించే పరిస్థితిలో ప్రభుత్వం లేదని అన్నారు.

అందుకే తక్షణమే ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఆదిత్య 369 రీ రిలీజ్ లో బాలయ్య సత్తా చాటుతాడా..?

ఆదిత్య 369 రీ రిలీజ్ లో బాలయ్య సత్తా చాటుతాడా..?