కాంగ్రెస్ మోదీని విమర్శించడం హాస్యాస్పదం..: బండి సంజయ్

బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్( MP Bandi Sanjay ) కీలక వ్యాఖ్యలు చేశారు.

కరీంనగర్ ప్రజల సమస్యలపై పోరాటం చేశానని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే అభ్యర్థిని కూడా ప్రకటించుకోలేని అసమర్థులా తనను ఓడించేదని ప్రశ్నించారు.

57 ఏళ్లలో మరుగుదొడ్లు కూడా కట్టివ్వకుండా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన కాంగ్రెస్( Congress ) మోదీని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని బండి సంజయ్ అన్నారు.

పదేళ్ల పాలనలో ప్రజలను రాచిరంపాన పెట్టిన కేసీఆర్ ఇప్పుడు నీతి సూత్రాలు వల్లిస్తున్నారని మండిపడ్డారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) చెప్పిందే చేస్తారని బండి సంజయ్ పేర్కొన్నారు.

ప్రజలకు కూడా మోదీ పాలనపై నమ్మకం ఉందన్న ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

వైరల్ వీడియో: పట్టపగలే దారుణం.. నడిరోడ్డుపై మత్తుమందు ఇచ్చి మహిళ కిడ్నాప్..