మానసిక ఒత్తిడిని దూరం చేసుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే..!

ప్రస్తుత సమాజంలో నిద్రలేచినప్పటి నుంచి ఉరుకులు, పరుగులు మొదలవుతాయి.చేయాల్సిన పనులతో హడావిడి, ఆందోళన ఎక్కువగా ఉంటాయి.

దీని ఫలితంగా ప్రజలలో ఒత్తిడి అనేది పెరిగిపోయింది.అందుకోసమే ఈ రోజులలో ఎక్కువ శాతం మంది ప్రజలు ఒత్తిడి( Stress )కి గురవుతున్నారు.

ఆందోళనతో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు.వీటివల్ల వచ్చే శారీరక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

మరి ఈ ఇబ్బందిని తగ్గించుకోవాలంటే చాలా అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

అందుకోసం ఇంట్లో మనమంతా పాటించగల చిన్నచిన్న చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. """/" / గోరువెచ్చని లేదా చల్లటి నీటితో స్నానం( Bath ) చేయడం వల్ల ఒత్తిడిని( Stress ) దూరం చేసుకోవచ్చు.

శరీరంలో ఎక్కడైనా నొప్పులుగా అనిపిస్తే చిన్నగా మసాజ్ చేసుకోవడం, కండరాలన్నీ సాగేలా ఒళ్ళు విరుచుకోవడం, లాంటి పనులు చేయడం వల్ల ఆ ఒత్తిడి దూరమవుతుంది.

బాత్రూంలో కూని రాగాలు తీయడం లేదా ఏదైనా లైట్ మ్యూజిక్ ని పెట్టుకుని గోరు వెచ్చని నీటితో మనసు తేలికగా పడేంత వరకు టాప్ బాత్ చేయాలి.

అందుకు మంచి సువాసన ఉన్న సహజమైన సబ్బును ఉపయోగించడం మంచిది.ఇలా చేయడం వల్ల ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది.

ఇంకా చెప్పాలంటే డాన్స్ చేయడం అనేది ఒత్తిడి నివారినిలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

మంచి సంగీతాన్ని పెట్టుకొని దానికి తగినట్లుగా డాన్స్ చేయవచ్చు.ఎవరైనా ఉన్నప్పుడు చేయడం మొహమాటం అయితే ఎవరూ లేనప్పుడు ఆ పని చేయాలి.

దీనివల్ల మనసుకు ఆనందం కలుగుతుంది. """/" / ఒత్తిడి హార్మోన్ల స్థాయినీ ఇది దూరం చేస్తుంది.

ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇష్టమైన వారితో ప్రేమగా సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించాలి.అందువల్ల శరీరంలో డోపమైన్ లాంటి హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి.

దీంతో ఒత్తిడి నుంచి త్వరగా బయటపడవచ్చు.ఇంకా చెప్పాలంటే రోజు కాసేపు పూజా మందిరంలో గడపడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

అలాగని దేనిని అతిగా చేయరాదు.గంటలు గంటలు పూజ చేస్తూ గడపడం కూడా అసలు మంచిది కాదు.

క్రమం తప్పకుండా దేవాలయానికి( Temple ) లేదా మసీదుకు లేదా చర్చికి వెళ్లడం వల్ల ఒత్తిడి ( Stress )కూడా దూరం అవుతుంది.

మీరు ఒత్తిడిలో ఉన్నారు అనుకున్నప్పుడు వీటిలో వీలైన వాటిని పాటించడం ఎంతో మంచిది.

థియేటర్లలో ఫ్లాపైనా అక్కడ మాత్రం హిట్.. విశ్వక్ సేన్ సెలక్షన్ కు తిరుగులేదుగా!