ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణకు కొత్త కాంగ్రెస్ ఇంచార్జ్ లు ఎంతమేర ఫలితం చూపగలరు.

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బలమైన పార్టీగా బరిలో నిలిచిన కాంగ్రెస్ ఇప్పుడు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో బాగా బలహీన పడింది.

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఇప్పట్లో పుంజుకోవడం కష్టం అనిపిస్తుంది.

కాంగ్రెస్ రాష్ట్ర విభజన సమయంలో చేసిన వ్యూహాత్మక తప్పిదమే దీనికి కారణం.అందుకే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు దొరకట్లేదు.

ఇక తెలంగాణ విషయానికి వస్తే అక్కడ కొంత బెటర్ గానే ఉన్న సేఫ్ గా మాత్రం లేదు ఎందుకంటే అక్కడ ప్రతిపక్ష స్థాయిని దక్కించుకోవడం కోసం బిజేపి గట్టిగా ప్రయత్నిస్తుంది.

ఆ ప్రయత్నం ఎక్కడ తమను దెబ్బ తీస్తుందో అని కాంగ్రెస్ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు.

ఇప్పటివరకు వీటిని పక్కనపెట్టిన కాంగ్రెస్ హైకమాండ్.ఇక వీటిపై దృష్టిసారించి సీరియస్ స్టెప్స్ తీసుకుంటుంది.

అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సరికొత్త వ్యవహారాల ఇంచార్జ్ లను నియమించింది.

ఇంతకీ వారెవరో ఇప్పుడు చూద్దాం.తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా మాణిక్యం ఠాగూర్‌ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా ఊమెన్‌చాందీని నియమించింది.

రెండు తెలుగు రాష్ట్రాలకు నియమితులైన సరికొత్త కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ లు తిరిగి కాంగ్రెస్ కు ఆయా రాష్ట్రాలలో పునర్ వైభవాన్ని తీసుకు వస్తారా లేదా అనేది వేచి చూడాలి.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..