కాంగ్రెస్, బీజేపీ కొత్త కుట్రలకు తెరలేపాయి..: కేటీఆర్

తెలంగాణలోని కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కాంగ్రెస్, బీజేపీ కొత్త కుట్రలకు తెరలేపాయని విమర్శించారు.

దేశంలో కేసీఆర్ చక్రం తిప్పకుండా కొత్త కుట్రలు చేస్తారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

ఈ క్రమంలో రానున్న పదిహేను రోజుల్లో సరికొత్త కుట్రలు వెలుగులోకి రాబోతున్నాయని చెప్పారు.

రకరకాల కుట్రలు పన్నుతూ మన ఆలోచనలు మారేలా చేస్తారన్నారు.ఈ నేపథ్యంలో వెలుగులు నింపే కేసీఆర్ కావాలా? చీకట్లు తెచ్చే కాంగ్రెస్ కావాలా అని ప్రశ్నించారు.

అనంతరం ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై జరిగిన ఘటనను ఖండించిన కేటీఆర్ ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు మంచిది కాదని తెలిపారు.

శంకర్ చేసిన మిస్టేక్స్ వల్లే గేమ్ చేంజర్ రిజల్ట్ ఇలా వచ్చిందా..?