ఏపీలో కాంగ్రెస్ కూటమి.. ఆ పార్టీకి నష్టమేనా..?

తెలంగాణలో ఎన్నికలు ముగిశాక ఏపీ ఎన్నికలలో ఎవరు గెలుస్తారనే ఆతృత ప్రతి ఒక్కరిలో ఉంది.

అయితే ఈసారి వైఎస్ఆర్సిపి ( YSRCP ) టిడిపి జనసేన కూటమి మధ్య గట్టి పోటీ ఉంటుంది.

కానీ మేము కూడా పోటీనే అని ముందుకు వస్తున్నారు కాంగ్రెస్.ఇక ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల ( Sharmila ) కు కీలక పదవి ఇవ్వబోతున్నట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతుంది.

ఇక వచ్చే సంవత్సరం జనవరిలో షర్మిల కాంగ్రెస్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది.

ఈరోజు అనగా డిసెంబర్ 27న ఢిల్లీలో అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ,కేసి వేణుగోపాల్ కలిసి ఆంధ్రప్రదేశ్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఏ విధంగాముందుకు పోవాలి.

ఏ విధంగా అక్కడ తమ పార్టీని విస్తరించాలి అనే విషయాలు చర్చించబోతున్నారట.అయితే ఈసారి ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ( Congress ) కూటమిగా ఏర్పడబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలైన సిపిఐ, సిపిఎంతో పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది.ఇక ఇప్పటికే తెలంగాణలో సిపిఐతో పొత్తు పెట్టుకుంది.

ఇక సిపిఎం ఒంటరిగానే బరిలో దిగినప్పటికీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు.అయితే ఏపీలో కూడా కమ్యూనిస్టు పార్టీలను కలుపుకొని పోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుందట.

"""/" / ఇక సిపిఐ ( CPI ) పార్టీ కలిసినప్పటికీ సిపిఎం పార్టీ కాంగ్రెస్ తో కలవదనే ప్రచారం జరుగుతుంది.

ఒకవేళ ఈ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశం మాత్రం కనిపిస్తోంది.

ఇక కాంగ్రెస్ కూటమిగా ఏర్పడితే మాత్రం ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుకి చుక్కలే అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు అనే ఉద్దేశంతో జనసేన టిడిపి కూటమిగా ఏర్పడ్డారు.

"""/" / అంతేకాకుండా బీజేపీ పార్టీని కూడా తమ పార్టీతో కలిసి పోవాలని మంతనాలు చేస్తున్నారు.

ఇక ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎంలను కలుపుకొని కూటమిగా ఏర్పడితే మాత్రం కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి చంద్రబాబు ( Chandrababu ) కి దెబ్బ పడుతుంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరి చూడాలి ఏపీలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందా లేదా కమ్యూనిస్టు పార్టీలను కలుపుకుంటుందా అనేది.

వావ్, ఆర్మీ వెహికల్‌ని హోటల్‌గా మార్చేశారు.. ఒక్క నైట్‌కి ఎంత ఛార్జ్ చేస్తారంటే…