హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. గోవా నుంచి తరలిస్తుండగా సీజ్

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం చెలరేగింది.గోవా నుంచి హైదరాబాద్( Goa To Hyderabad ) కు బస్సులో అక్రమంగా డ్రగ్స్ తరలిస్తుండగా సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు.

ఈ క్రమంలో ఐదుగురిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అనంతరం నిందితుల నుంచి నాలుగు గ్రాముల ఎండీఎంఏ, ఐదు గ్రాముల గంజాయిని ( MDMA, Five Grams Of Marijuana ) స్వాధీనం చేసుకున్నారు.

ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న నాగరాజు గత మూడు నెలలుగా గోవాలోని ఓ పబ్ లో ఈవెంట్ ఆర్గనైజర్ గా పని చేస్తున్నాడని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ నెల 4న నాగరాజు, అతని స్నేహితులు గోవాకు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేశారని సమాచారం.

విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్స్ ముఠాలో ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బర్త్ డే క్వీన్ నవీన రెడ్డి: మంచి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీ లో స్టార్ ఇమేజ్ దక్కించుకున్న నటి…