జనగామ కాంగ్రెస్ లో అయోమయం.. ఆ కీలక నేతకు టికెట్ దక్కేనా..?

యుద్ధానికి సమర శంఖం పూరించండి.సైనికులంతా అలర్ట్ కండి.

ప్రత్యర్థులను మట్టి కల్పించేలా వ్యూహాలు పన్నండి.అనే విధంగా తయారయింది తెలంగాణ( Telangana ) రాష్ట్రంలో పార్టీల పరిస్థితి.

కొన్ని నెలల్లో ఎలక్షన్స్ ఉన్న తరుణంలో యుద్ధం నీదా నాదా హై అనే విధంగా ప్రతి పార్టీ నాయకుడు బరిలోకి దిగి నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు.

గత ఎలక్షన్లలో కనబడిన ముఖాలు మళ్లీ ఈ ఎన్నికల్లో మళ్లీ కనిపించబోతున్నాయి.

ఈ తరుణంలో అధికార బిఆర్ఎస్( Brs ) పార్టీ ఇప్పటికే 115 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి పకడ్బందీగా బరిలోకి దించింది.

"""/" / ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ( Congress ) ప్రతి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరింది.

ఇప్పటికే వెయ్యికి పైగా దరఖాస్తులు అందాయి.ఆ దరఖాస్తులను పరిశీలించే పనిలో పడింది.

పరిశీలన తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.కట్ చేస్తే.

ఇక జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఓవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులైన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి( Palla Rageshwar Reddy ) టికెట్ కోసం హోరాహోరీగా పోట్లాడుకుంటున్నారు.

"""/" / ఇదే తరుణంలో కాంగ్రెస్ లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడిందట.

టికెట్ కోసం ఇప్పటికే ఇద్దరు నేతలు దరఖాస్తు చేసుకున్నారట.ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒకప్పటి టీపీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య( Ponnala Lakshmaiah ) .

ఆయన 2014,2018 ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.ఈసారి ఏ విధంగానైనా టికెట్ తెచ్చుకొని గెలవాలని భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే జనగామ నియోజకవర్గానికి చెందిన కొమ్మురి ప్రతాపరెడ్డిని జనగామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించింది ఏఐసీసీ.

ఇక అప్పటి నుంచి ప్రతాప్ రెడ్డి కూడా జనగామలో గట్టిగానే పర్యటిస్తున్నారు.ఈ విధంగా జనగామ ( Janagama ) నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున కీలక నేతలుగా ఈ ఇద్దరు ఉండడంతో, కాంగ్రెస్ టికెట్ ఎవరికి కట్టబెడుతుందో అని ఆందోళన చెందుతున్నారు ఆ నేతలు.

2018 ఎన్నికల్లో పోటీ చేసి పొన్నాల 62 వేల ఓట్లు సంపాదించగా, యాదగిరిరెడ్డి 91,500ఓట్లు సంపాదించారు.

రెండుసార్లు ఓడిపోయిన సెంటిమెంటు పొన్నాలపై ఉంది.అలాగే గత కొంతకాలంగా ప్రతాప్ రెడ్డి ( Prathap Reddy ) తీవ్రంగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు.

ఈయనకు కూడా కాస్త పేరు ఉంది.మరి ఇద్దరిలో టికెట్టు ఎవరికి కేటాయిస్తే బాగుంటుందనేది అధిష్టానం నిర్ణయం చేస్తే గాని అసలు విషయం బయటకు రాదు.

ఒకవేళ ఇద్దరిలో ఒకరు కాంప్రమైజ్ అయితే ఎవరికో ఒకరికి టికెట్ కట్టబెడితే తప్పనిసరిగా ఆ సీట్ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

వారానికి ఒక్కసారి ఈ హెయిర్ టానిక్ ను వాడితే వద్దన్నా మీ జుట్టు దట్టంగా పెరుగుతుంది!