ఆ సీట్ పై బిఆర్‌ఎస్ లో కన్ఫ్యూజన్ ?
TeluguStop.com
తెలంగాణలో ఎన్నికలు( Telangana Elections ) డగ్గర పడడంతో రేస్ లో నిలిచే అభ్యర్థుల విషయంలో ప్రధాన పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.
గెలిచే అవకాశం ఉన్నవారికే సీట్లు కేటాయించేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నాయి.ఇక ఇప్పటికే అధికార బిఆర్‌ఎస్( BRS ) మొదటి అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఎన్నికల సంగ్రామనికి తెర తీసింది.
అన్నీ స్థానాల్లో మోజారిటీ భాగం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కేటాయించిన బిఆర్‌ఎస్ అధిష్టానం.కొన్ని స్థానాల్లో అభ్యర్థుల మార్పు తప్పదని లిస్ట్ విడుదల చేసిన రోజే అధినేత కేసిఆర్( KCR ) స్పష్టం చేశారు.
"""/" /
ఇక ఇటీవల మంత్రి హరీష్ రావు పై( Harish Rao ) వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీలో చిచ్చు పెట్టిన మైనంపల్లి హనుమంతరావు కు( Mynampalli Hanumantha Rao ) ఎవరు ఊహించని విధంగా ఆయనకే సీటు కేటాయించారు కేసిఆర్.
అయితే ప్రస్తుతం మైనంపల్లికి సీటు క్యాన్సిల్ చేసేందుకు బిఆర్‌ఎస్ అధిష్టానం ప్రయత్నిస్తోందట.మల్కాజ్ గిరి సీటు( Malkajgiri ) మైనంపల్లికి కేటాయించినప్పటికి ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే భావనతో ఆయన స్థానాన్ని భర్తీ చేసే నేత కోసం బిఆర్‌ఎస్ అధిష్టానం వెతుకులాట ప్రారంభించినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు అభ్యర్థులను కూడా కేసిఆర్ పరిశీలిస్తున్నడట.
"""/" /
మరోవైపు బిఆర్‌ఎస్ నుంచి మైనంపల్లి బయటకు వచ్చే అవకాశం ఉండడంతో ఆయన ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉంటున్నారని తెలుస్తోంది.
ఒకవేళ కాంగ్రెస్ లోకి మైనంపల్లి వెళితే అదే మల్కాజ్ గిరి నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశం ఉంది.
దీంతో మైనంపల్లిని ఎదుర్కొనే నేత కోసం బిఆర్‌ఎస్ వెతుకుతోందట.మర్రి రాజశేఖర్ రెడ్డికి( Marri Rajasekhar Reddy ) మల్కాజ్ గిరిలో మంచి పేరు ఉండడంతో ఆయన పేరే కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందని వినికిడి.
త్వరలోనే మల్కాజ్ గిరి సీటు విషయంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇక తన తనయుడి సీటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న మైనంపల్లి హస్తం పార్టీలోనైనా కొడుకు కోసం సీటు సంపాధించుకుంటారో లేదో చూడాలి.
విశ్వంభర లో చిరంజీవి త్రిబుల్ రోల్ లో నటిస్తున్నారా..?