బీజేపీలో కన్ఫ్యూజన్ తొలగినట్లేనా ?

తెలంగాణ బీజేపీ ప్రస్తుతం డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

నేటితో ప్రచారానికి కూడా తెరపడడంతో ఇక ఎన్నికల్లో పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుందనే దానిపైనే నేతలంతా దృష్టి సారించారు.

కాగా గతంతో పోల్చితే ప్రస్తుతం ఎన్నికల ముందు కమలం పార్టీ డెడ్ స్లో గా ముందుకు సాగుతోంది.

పార్టీ ఈ స్థాయిలో స్లో అవ్వడం వెనుక చాలానే కారణాలు ఉన్నప్పటికి అవేవీ పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేశారు కమలనాథులు.

జాతీయ నేతలందరూ కూడా ప్రచారంలో పాల్గొని పార్టీకి మైలేజ్ పెంచే ప్రయత్నం చేశారు.

"""/" / ఇదిలా ఉంచితే గత కొన్నాళ్లుగా ప్రచారంతో హోరెత్తించిన కమలం పార్టీలో ప్రస్తుతం కన్యూజన్ మొదలైనట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా సి‌ఎం అభ్యర్థి విషయంలో ఎవరి వైపు మొగ్గు చూపాలి అనే దానిపై అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

బీసీనేతను సి‌ఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పిన బీజేపీ అధినాయకులు ఆ నేత ఎవరనే విషయాన్ని మాత్రం సస్పెన్స్ లో ఉంచారు.

అయితే మొదటి నుంచి కూడా బీజేపీ తరుపున సి‌ఎం అభ్యర్థిగా బండి సంజయ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

కానీ ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తరువాత అధిష్టానం బండి సంజయ్ ని పక్కన పెట్టిందనే అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.

"""/" / ఇదే టైమ్ లో ఈటల రాజేందర్ కు అధిష్టానం ఎక్కువ ప్రదాన్యం ఇస్తూ రావడంతో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటెలను సి‌ఎం అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు వినిపించాయి.

దాంతో బీజేపీ నుంచి సి‌ఎం అభ్యర్థి ఎవరనే అంశం బండి సంజయ్ మరియు ఈటల రాజేందర్ చుట్టూ తిరుగుతూ వచ్చింది.

కాగా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం బండి సంజయ్ నే సి‌ఎం అభ్యర్థిగా ఎన్నుకునే ఆలోచనలో అధిష్టానం ఉందట.

తెలంగాణలో బీజేపీని బలపరచడంలో బండి ముఖ్య పాత్ర పోషించారు.అందుకే ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ఆయననే సి‌ఎంగా ఎన్నుకునే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం.

మొత్తానికి సి‌ఎం అభ్యర్థి విషయంపై బీజేపీలో నెలకొన్న కన్ఫ్యూజన్ కు తెరపడినట్లేనని తెలుస్తోంది.

వీడియో: బైక్‌పై పిల్లోడు ఉన్నా.. స్టంట్స్ చేశాడు.. మండిపడుతున్న నెటిజన్లు..