కమలం పార్టీలో మళ్ళీ కన్ఫ్యూజన్ గోల !

తెలంగాణ బీజేపీలో( BJP ) పదవులపై మళ్ళీ కన్ఫ్యూజన్ నెలకొందా ? ఎన్నికల్లో ఓటమి తరువాత మళ్ళీ మార్పుల వైపు పార్టీ పెద్దలు దృష్టి సారించారా ? అంటే అవుననే సమాధానాలు ఈ మద్య ఎక్కువగా వినిపించాయి.

కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత పార్టీ అనూహ్యంగా డీలా పడింది.

అంతకు ముందు బండి సంజయ్( Bandi Sanjay ) నేతృత్వంలో పార్టీ క్యాడర్ యమ దూకుడుగా కనిపించింది.

బి‌ఆర్‌ఎస్ పార్టీకి గట్టి పోటీనిచ్చే సంకేతాలను బీజేపీ క్రియేట్ చేసింది.కట్ చేస్తే అనూహ్యంగా అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తప్పించి ఆ బాద్యతలు కిషన్ రెడ్డి( Kishan Reddy ) భుజాన వేయడంతో పార్టీ పూర్తిగా గాడిపట్టింది.

"""/" / నేతల మద్య అంతరం పెరగడం, ఎవరికి వారే అన్నట్లుగా పార్టీలో పరిస్థితులు ఏర్పడడంతో పార్టీ ఒక్కసారిగా డీలా పడింది.

కిషన్ రెడ్డి నాయకత్వం కూడా పార్టీకి పెద్ద మైనస్ గానే మారింది.దాంతో ఎన్నికల్లో బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితం కావాల్సి వచ్చింది.

ఇక మరో నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.ఈసారి అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన తప్పులను సరిదిద్దుకొని కొత్త ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలవాలని చూస్తోంది కాషాయ పార్టీ.

ఈ నేపథ్యంలో మరో కన్ఫ్యూజన్ కమలనాథులను వెంటాడుతోంది. """/" / కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత పార్టీకి ఎలాంటి మైలేజ్ రాలేదు.

దాంతో ఆయనను తప్పించి మళ్ళీ ఆ బాధ్యతలు బండి సంజయ్ కే కట్టబెడితే ఎలా ఉంటుందనే ఆలోచనలో బీజేపీ అధినాయకత్వం ఉన్నట్లు టాక్.

అయితే సరిగ్గా ఎన్నికల ముందు ఇలాగే మార్పులు చేపట్టి అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly Elections ) ఘోరంగా దెబ్బ తిన్న సంగతి తెలిసిందే.

దాంతో పార్లమెంట్ ఎన్నికల ముందు మరోసారి అధ్యక్ష పదవి మార్పు చేసే సాహసం బీజేపీ అధిష్టానం చేస్తుందా అనేది సందేహమే.

అయితే పార్టీని జోష్ లో నడిపించాలంటే సరైన నాయకత్వం ఎంతైనా అవసరం.అందుకే అధ్యక్ష పదవి విషయంలో కాషాయ పెద్దలను ఈ కన్ఫ్యూజన్ వెంటాడుతోందట.

మరి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటలని చూస్తున్న బీజేపీ ముందు రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

వైరల్ వీడియో: ఇంత సులువుగా చెపాతీలను చేసేయొచ్చా..?