తెలంగాణభవన్ వద్ద గందరగోళ పరిస్థితులు..!

హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్ద తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది.తెలంగాణ భవన్ వద్ద దీక్షా దివస్ నిర్వహణకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు.

బీఆర్ఎస్ ఓ వైపు ఏర్పాట్లు పూర్తి చేస్తుండగా మరోవైపు ఎలక్షన్ కమిషన్ స్క్వాడ్ తెలంగాణ భవన్ కు చేరుకుంది.

దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉన్నందున దీక్షా దివస్ నిర్వహించొద్దని ఎన్నికల సంఘం అధికారుల బృందం తెలిపింది.

ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన లీగల్ టీమ్ ఎన్నికల కమీషన్ స్క్వాడ్ బృందంతో సంప్రదింపులు జరుపుతున్నారు.

నెయ్యితో ఆరోగ్యాన్నే కాదు అందాన్ని కూడా పెంచుకోండిలా!