పలాస వైసీపీలో విభేదాలు.. మంత్రికి కష్టాలు..?

ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో గెలుపొంది అధికారం లోకి వచ్చిన సంగతి అందరికీ విదితమే.

ఈ క్రమంలోనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ తామే విజయం సాధిస్తామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కానీ, మరో వైపున అధికార వైసీపీలోనూ నేతల మధ్య విభేదాలు ఉన్నాయని వార్త లొస్తున్నాయి.

శ్రీకాకుళం జిల్లాలోని ‘పలాస’ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య గ్రూపు రాజకీయం జరుగుతున్నదని తెలుస్తోంది.

ఈ అసెంబ్లీ స్థానం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు.

అయితే, డాక్టర్ సీదిరిని గెలిపించేందుకుగాను కష్టపడిన వైసీపీ నేతలు, కార్యకర్తలను ఆయన ఇప్పుడు పట్టించుకోవడం లేదని టాక్.

నియోజకవర్గంలోని నేతలనూ మంత్రి అస్సలు ఖాతరు చేయడం లేదని చర్చ జరుగుతున్నది.గత ఎన్నికల్లో టీడీపీ మహిళా నాయకురాలు గౌతు శిరీషను ఓడించిన డాక్టర్ సీదిరి.

అనూహ్యంగా మంత్రి అయ్యారు.ఆయన గెలుపునకు కృషి చేసిన కేడర్, నేతలను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

రెండున్నరేళ్ల నుంచి మంత్రి డాక్టర్ సీదిరి నియోజకవర్గ నేతలను అస్సలు పట్టించుకోడం లేదని సమాచారం.

ఈ క్రమంలోనే వారు మంత్రికి వ్యతిరేకంగా పని చేయాలని అనుకుంటున్నట్లుగా సమాచారం.ఈ క్రమంలోనే మంత్రికి అనుకూల, వ్యతిరేక వర్గంగా నియోజకవర్గంలో రెండు గ్రూపులు ఏర్పడినట్లు తెలుస్తోంది.

అలా మంత్రి సీదిరిపైన వ్యతిరేక పవనాలు వీచేందుకుగాను ఇప్పటి నుంచే అడుగులు పడుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి కూడా.

"""/" / మంత్రి డాక్టర్ సీదిరి త్వరలో అన్ని వర్గాలను ఒక్కటి చేస్తారని నియోజకవర్గంలో వైసీపీని మరింత బలోపేతం చేస్తారని ఈ సందర్భంగా వైసీపీ వర్గాలు అంటున్నాయి.

మంత్రి సైతం బుజ్జగింపులకు వచ్చి నేతలందరినీ ఒక్కటి చేస్తారని కొందరు నేతలు చెప్తున్నారు.

అయతే, నియోజకవర్గంలో డాక్టర్ సీదిరిని ఓడించేందుకుగాను టీడీపీ వర్గాలు కూడా ఫోకస్ చేస్తున్నాయి.

అలా వచ్చే ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఉండ బోతున్నదని సమాచారం.

శిల్పాశెట్టి దంపతులకు భారీ షాక్ తగిలిందా.. అన్ని కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేశారా?