అక్కినేని, ఎన్టీఆర్ మధ్య ఆరేళ్ల పాటు యుద్ధం.. ఇంత పెద్ద గొడవ జరిగిందా?

తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచిన హీరోలలో మొదటి వరుసలో వినిపించే పేరు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు.

మొదటి తరం హీరోలలో వీరు ఎవరికి సాధ్యం కాని రీతిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అని చెప్పాలి.

సినిమా ఇండస్ట్రీకి సరికొత్త హంగులను తీసుకువచ్చింది కూడా ఈ ఇద్దరు హీరోలే.టాప్ హీరోలుగా కొనసాగిన అక్కినేని ఎన్టీఆర్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు కావడం గమనార్హం.

అయితే ఎంత మంచి స్నేహితులైనా ఏదో ఒక విషయంలో కొన్ని కొన్ని సార్లు విభేదాలు వస్తూ ఉంటాయి.

అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీఆర్ విషయంలో కూడా ఇలాంటి విభేదాలు తెరమీదకి వచ్చి హాట్ టాపిక్ గా మారిపోయాయట.

గుమ్మడి వెంకటేశ్వరరావు రాసుకున్న తీపి గుర్తులు చేదు జ్ఞాపకాలు పుస్తకంలో ఇక ఈ విషయాన్ని ప్రస్తావించారు.

కాగా అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీఆర్లు ఒకే జిల్లా కృష్ణ నుంచి మద్రాస్ కు వెళ్లి సినిమాల్లో అవకాశం దక్కించుకొని రాణించారు.

అయితే సోదర భావంతో మెలుగుతూ మంచి స్నేహితులుగా ఉన్న వీరి మధ్య వివాదాలు రావడానికి రాజకీయాలే కారణం అన్నది తెలుస్తుంది.

1960లో అక్కినేని హైదరాబాద్కు వచ్చారట. """/"/ ఈ క్రమంలోనే అక్కినేని షూటింగ్ లు కూడా హైదరాబాద్లోనే పెట్టుకునే వారట.

ఎన్టీఆర్ మాత్రం తమిళనాడులోని సినీ రంగంతో ఉన్న బంధం కారణంగా త్వరగా హైదరాబాద్ రాలేకపోయారు.

ఎప్పుడో ఒకసారి మాత్రమే షూటింగ్ కోసం హైదరాబాదు వచ్చి వెళ్ళిపోయేవారు.ఇక ఇలాంటి సమయంలోనే క్షేత్రస్థాయిలో ఇద్దరు హీరోల అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి అక్కినేని వల్లే.

ఎన్టీఆర్ కు బ్యాడ్ నేమ్ వస్తుందని.అక్కినేని హైదరాబాద్ రాకుండా ఉంటే బాగుండేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రచారం చేశారట.

ఇలాగే అక్కినేని అభిమానులు కూడా ఎన్టీఆర్ పై ఏదో ఒక ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

అభిమానుల గొడవ వల్ల వీరి మధ్య గ్యాప్ పెరిగి దాదాపు ఆరేళ్లపాటు కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు ఈ ఇద్దరు హీరోలు.

కానీ ఆ తర్వాత మాత్రం ఎన్టీఆర్ హైదరాబాదు రావడంతో ఇద్దరూ కలిసిపోయారు.ఇక తర్వాత ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు.

వీరు నటించిన ఎన్నో సినిమాలు ఇండస్ట్రీలో మైలు రాయి లాంటి సినిమాలుగా మిగిలిపోయాయి అన్న విషయం తెలిసిందే.

ఇదేందయ్యా ఇదే.. స్కూల్ యూనిఫామ్ తొడుక్కున్న కుక్క.. వీడియో వైరల్..