బిజెపి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు పై సమావేశ కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం పై నాయకులకు, కార్యకర్తలకు శనివారం ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహిళా మోర్చా అధ్యక్షురాలు బర్కం లక్ష్మి, శ్రీనివాసరావు లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త గ్రామాలలో బూతులలో తప్పనిసరిగా సభ్యత్వం చేయించాలని సభ్యత్వ నమోదులో ప్రజలను భాగస్వామ్యం చేయించాలని అన్నారు.

సభ్యత్వ నమోదుకు మిస్సేడ్ కాల్ 8800002024 చేయించాలని కార్యకర్తలకు, నాయకులకు వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో చందుపట్ల లక్ష్మారెడ్డి,కోనేటి సాయిలు, నంది నరేష్, కృష్ణ హరి, రామచందర్ రెడ్డి,రవి నాయక్,కిరణ్ నాయక్,వంగల రాజు, చందుపట్ల రాజిరెడ్డి, మానుక కుమార్,అనూష్ యాదవ్, సంజీవరెడ్డి,గాల్ రెడ్డి, రవి,ఆంజనేయులు, సత్యం రెడ్డి, శ్రీకాంత్,బాల గౌడ్, దయాకర్ రెడ్డి,ప్రకాష్, కర్ణాకర్ రెడ్డి, నరేష్ రెడ్డి, శ్రీనివాస్, వేణు, నరసయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పుష్ప 2 సుకుమార్ కి ఏ రేంజ్ లో హిట్ ఇవ్వబోతుంది…