ఎవరైనా అలా చేస్తే కొట్టేసేదానిని.. కండక్టర్ ఝాన్సీ కామెంట్స్ వైరల్!

సాధారణంగా సినిమా, టీవీ రంగాలలో పాపులారిటీని సొంతం చేసుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.

అయితే కండక్టర్ ఝాన్సీకి మాత్రం అదృష్టం కలిసొచ్చి ఓవర్ నైట్ లో పాపులారిటీ వచ్చింది.

ఝాన్సీ, ఆమె భర్త ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

పెళ్లైన తర్వాత ఒక నెల పాటు చాలా ఇబ్బందిగా ఉండేదని నా భార్యకు రెండు చీరలు మాత్రమే ఉండేవని ఝాన్సీ భర్త అన్నారు.

ఆ సమయంలో డబ్బులు లేవని బాధ పడొద్దని చెప్పానని ఝాన్సీ భర్త అన్నారు.

ఎవరితో మాట్లాడవద్దని జాగ్రత్తగా ఉండాలని కొంతమందితో ఎక్కువగా కలవొద్దని నా భార్యకు సూచించానని ఝాన్సీ భర్త చెప్పుకొచ్చారు.

మంచివాళ్లతో మాత్రమే మాట్లాడాలని సూచించానని ఝాన్సీ భర్త పేర్కొన్నారు.కొత్తలో ఎవరైనా ఝాన్సీ డ్యాన్స్ వేస్తుంటే ఈల వేస్తే గూబ పేలిపోయేదని ఝాన్సీ భర్త చెప్పుకొచ్చారు.

ఈ ఫీల్డ్ లో ఇది కామన్ కాబట్టి ఇప్పుడు సైలెంట్ అయ్యానని ఝాన్సీ భర్త పేర్కొన్నారు.

"""/"/ ఎవరైనా ఈల వేస్తే ఝాన్సీ మైక్ విసిరేస్తుందని ఝాన్సీ భర్త తెలిపారు.

ఝాన్సీ మాట్లాడుతూ స్టార్టింగ్ లో ఆ విధంగా చేసేదానినని చెప్పుకొచ్చారు.ఎవరైతే ఏదైనా మాట అన్నా కామెంట్ చేసినా కొట్టేసేదానినని ఆమె కామెంట్లు చేశారు.

ఆ తర్వాత ఊర్లోవాళ్లకు శత్రువులు అయిపోతున్నామని ఆగిపోయానని ఆమె తెలిపారు. """/"/ అది నేను కాదు అన్నప్పుడు ఎందుకు ఫీలై కొట్టాలా అని అనిపించి ఆ తర్వాత నేను ఆగిపోయానని ఆమె చెప్పుకొచ్చారు.

ఇప్పుడు సినిమాల్లో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కు గౌరవం ఇస్తున్నారని బాగా నటించే వాళ్లు ఇప్పుడు తక్కువగా ఉన్నారని ఆమె కామెంట్లు చేశారు.

ఇప్పుడు పరవాలేదని ఆర్టిస్టులకు వాల్యూ ఉందని ఆమె అన్నారు.మూవీ ఇండస్ట్రీపైన నేను ఎలాంటి బ్యాడ్ రిమార్క్ వినలేదని ఆమె చెప్పుకొచ్చారు.

రైలులో చోటులేదనేమో.. 290 కి.మీ. ఏకంగా రైలు కోచ్ కింద ప్రయాణించిన వ్యక్తి