కండక్టర్ ఝాన్సి కి చైతన్య మాస్టర్ కి మధ్య ఉన్న సంబంధం ఎంటి..?
TeluguStop.com
బుల్లితెర రియాలిటీ డ్యాన్స్ షోలలో కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తూ.పలువురికి సుపరిచితులైన కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్.
( Chaitanya Master ) ఆయన ఆత్మహత్య చేసుకున్న ఉదంతం షాకింగ్ గా మారింది.
తనను అందరూ క్షమించాలని.సారీ చెబుతూ తప్పనిసరి పరిస్థితుల్లో సూసైడ్ చేసుకుంటున్నట్లుగా వీడియోను పోస్టు చేసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ వీడియో లో ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు చెప్పారు.ఢీ షో( Dhee Show ) తనకు పేరు తెచ్చిపెట్టింది కానీ ఆర్థికంగా నిలబెట్టలేకపోయిందన్నారు.
జబర్దస్త్ షోకి ఇస్తున్న రెమ్యూనరేషన్స్ కూడా ఢీలో ఇవ్వడం లేదన్నారు.అలా అని అయన నిర్మాణ సంస్థపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు.
అప్పులు చేస్తే తీర్చే సత్తా ఉండాలి.నాకు ఉంది కానీ.
ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను అన్నారు.ఈ జీవితం చాలు.
పేరెంట్స్ క్షమించాలని ఆ వీడియోలో చైతన్య కోరాడు.ఇక చైతన్య మాస్టర్ ఆత్మహత్యపై పలువురు తమదైన రీతిలో స్పందించారు .
శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కండక్టర్ , డ్యాన్సర్ ఝాన్సీ(
Jhansi ) షాకింగ్ కామెంట్స్ చేశారు .
ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల అమ్మ, నాన్న, చెల్లి బాధపడుతున్నారు.ఆయనతో కలిసి అందరూ ట్రావెల్ అయినవాళ్లే.
ఇదీ నా పరిస్థితి అని చెప్పి ఉండుంటే వాళ్లు కరిగేవాళ్లే.అయన ఒక్కమాట ఇంత బాధాకరమైన పరిస్థితి వచ్చుండేది కాదు.
చైతన్య మాస్టర్ చాలా మంచి వ్యక్తి.తనకున్న లేకపోయినా పక్కవాళ్లకు సాయం చేసే గుణం అయనది.
డిసెంబర్ 31 కండెక్ట్ చేసిన ఓ ప్రోగ్రామ్‌లో కొంత మంది ఆర్టిస్టులు ఆయనకు హ్యాండిచ్చారు.
"""/" /
దాంతో ఆ కమిటీ వాళ్లు మాస్టర్‌కు రావాల్సిన అమౌంట్‌ను ఆపేశారు.
ఇక దానితో దాదాపు ఆరేడు లక్షల మొత్తమది.దాని వల్ల ఒక అప్పు .
అలా అలా అప్పులు చేసుకుంటూ వచ్చారు.అలా చేయటం వల్లనే తట్టుకోలేకి ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు.
చైతన్య మాస్టర్‌తో ఐదు రోజుల ముందే ప్రోగ్రామ్ చేశాం.చాలా మంచి వ్యక్తి.
తోటి కళాకారులకు మంచి గౌరవం ఇస్తారు.డిసెంబర్ 31న కొంత మంది ఆర్టిస్టులను తీసుకొస్తానని చెప్పారు.
కానీ వారు ప్రోగ్రామ్‌కు రాకుండా హ్యాండిచ్చారు.అనుకున్న వాళ్లు రాకపోవటంతో కమిటీ వాళ్లకు కూడా లాస్ వచ్చింది.
దాంతో వాళ్లు మాస్టర్‌కు పేమెంట్ ఆపేశారు. """/" /
కానీ మాస్టర్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్లకు డబ్బులు ఇవ్వటం కోసం వాళ్ల దగ్గర వీళ్ల దగ్గర అప్పులు తెచ్చి పేమెంట్స్ ఇచ్చారు .
మోసం చేయకూడదని తోటి కళాకారులకు అప్పు తెచ్చి మరీ డబ్బులు ఇచ్చారు.ఆర్గనైజర్స్‌కు నేను చేసుకునే విన్నపం ఏంటంటే.
ఓ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మా ఒంట్లో బాగున్నా బాగోలేకపోయినా చాలా కష్టపడి పెర్ఫామెన్స్ చేస్తాం.
మీకు ప్రోగ్రామ్ నచ్చకపోతే నెక్ట్స్ నుంచి పిలవకండి.కానీ పేమెంట్స్ ఆపేయవద్దు అని ఝాన్సీ చెప్పుకొచ్చింది.
అలాగే చైతన్య మాస్టర్ తో ఏ ప్రోగ్రాం చేసిన కూడ ఆయన నన్ను సొంత సోదరి లాగా చాలా బాగా చూసుకునే వాడు అని చెప్పింది.
ఇక ఏది ఏమైనా ఆయన అలా అత హత్య చేసుకొని చనిపోవడం.నిజం గా చాలా మంది ఆయన అభిమానులకి భాదను కలిగిస్తుంది.
అందంగా ఉండడం ఆ అమ్మాయికి ఇబ్బందిగా మారిందా? వీడియో వైరల్