డిసెంబర్ 24న కరీంనగర్ & రాజన్న సిరిసిల్ల జిల్లాలో దిశ సమావేశం నిర్వహణ
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: డిసెంబర్ 24న ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లోనికి ఆడిటోరియం హాల్ లో కరీంనగర్ & రాజన్న సిరిసిల్ల జిల్లాల అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశం నిర్వహిస్తున్నామని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి బి.
శేషాద్రి ఒక ప్రకటనలో తెలిపారు.కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చైర్మన్ గా జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమావేశం డిసెంబర్ 24న జరుగుతుందని , ఇందులో రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి వర్యులు, శాసనసభ్యులు, ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యులు పాల్గొంటారని,ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేయుచున్న పథకాల పై సమీక్ష నిర్వహించడం జరుగుతుందని, దానికి సంబంధించిన సమాచారంతో సంబంధిత అధికారులు విధిగా ఈ సమావేశానికి హాజరుకావాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదేం కారు, జంక్‌యార్డ్ నుంచి డైరెక్ట్‌గా తీసుకొచ్చినట్టుంది.. ఉబర్‌ను ఏకిపారేశాడు!