వేములవాడ రూరల్ మండల అన్ని పార్టీల నాయకుల కు అవగాహన కార్యక్రమం నిర్వహణ

ప్రజలు శాంతి యుతం గా ఓటు హక్కు వినియోగించుకోవాలి -డి ఎస్పీ నాగేంద్ర చారీ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల పరిధిలో గల అన్ని రాజకీయ పార్టీ ల నాయకుల తో రానున్న పార్లమెంట్ ఎన్నికల గురించి అవగాహన కార్యక్రమం ను వేములవాడ డి ఎస్పీ నాగేంద్ర చారీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అని వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

ఈ సందర్బంగా వేములవాడ డి ఎస్పీ నాగేంద్ర చారీ నాయకులను ఉద్దేశించి రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో ప్రతీ ఒక్కరు ఎన్నికల నియమావళి ని అనుసరించి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుటకు సహకరించాలి అని, గతం లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుటకు సహకరించిన విధంగా గానే రానున్న ఎన్నికలు కూడా సహకరించి ప్రతీ ఓటరు స్వచ్చందగా, నిర్భయంగా ఓటు వేయటం లో నాయకులు సహకరించాలి అని, ఎన్నికల నేపథ్యంలో లో ఒకరి పై ఒకరు బేదాభిప్రాయాల కు పోకుండా సోషల్ మీడియా వేదికగా ఇతర పార్టీ ల గురించి కానీ నాయకుల గురించి కానీ అభ్యన్త్రకర పోస్టులు పెట్టకూడదు అని, ప్రతీ ఒక్కరు చట్టానికి లోబడి, ఎన్నికల నియమావళిని పాటించాలి అని చట్ట పరిధి దాటితే కేసులు నమోదు చేస్తాము అని భవిష్యత్తు లో ఇట్టి కేసుల వల్ల ఇబ్బందులకు గురి కావద్దు అని కోరారు.

ఈ కార్యక్రమం లో మండలం లోని అన్ని రాజకీయ పార్టీ ల నాయకులు, వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

హాలీవుడ్ టెక్నాలజీతో రాజమౌళి సక్సెస్ సాధిస్తారా..?