నిబంధనల ప్రకారం పక్కాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ

రాజన్న సిరిసిల్ల జిల్లా : జూన్ 9న జరుగనున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్( Group 1 Prelims) పరీక్షను నిబంధనల ప్రకారం పక్కగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి( Santhi Kumari ) సంబంధిత అధికారులను ఆదేశించారు.

గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్ లోని డాక్టర్ బి.

ఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ, వానాకాలం పంట సీజన్ విత్తనాలు, ఎరువుల లభ్యత, మిషన్ భగీరథ త్రాగు నీటి కనెక్షన్ల సర్వే, స్కూల్ యూనిఫాంల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ లు పి.

గౌతమి, ఖిమ్యా నాయక్ లతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ స్ట్రాంగ్ రూం నుండి పరీక్షా కేంద్రానికి ప్రశ్నా పత్రాలు, తిరిగి పరీక్షా కేంద్రం నుండి జవాబు పత్రాలు రిసెప్షన్ సెంటర్ కు తరలించడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, స్ట్రాంగ్ రూమ్ నుంచి పోలీస్ బందోబస్తుతో తీసుకొని వెళ్ళి పరీక్షా కేంద్రాల్లోని లైజనింగ్ అధికారులకు అందజేయాలని, రిసెప్షన్ సెంటర్ లో టి.

జి.ఎస్.

పి.ఎస్.

సి.అధికారులకు అందజేయాలని ఆదేశించారు.

ప్రశ్న పత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ లను సన్నద్ధం చేయాలని, రేపు జిల్లాలకు ముఖ్యమైన సామాగ్రి, ప్రశ్న పత్రాలు చేరుకుంటాయని, వాటిని భద్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

పరీక్ష కేంద్రం పరిసరాలు 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్ష కేంద్రం సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను పూర్తిస్థాయిలో మూసివేయాలని సీఎస్ సూచించారు.

వానాకాలం పంట సీజన్ ప్రారంభమవుతుందని, రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు, ఎరువుల స్టాక్ మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, వాటి పంపిణీ లో ఎక్కడా ఇబ్బందులు రాకుండా పట్టిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ లకు సీఎస్ సూచించారు.

రాబోయే 20 నుంచి 25 రోజుల వ్యవధిలో చాలా వరకు రైతులు విత్తనాల కొనుగోలు చేస్తారని, ఈ సమయంలో క్షేత్రస్థాయిలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ నకీలీ విత్తనాలను అరికట్టాలని అన్నారు.

వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో పని చేస్తూ నకీలి విత్తనాలు ఎక్కడా విక్రయించకుండా చూడాలని, నకిలి విత్తనాలు విక్రయిస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

రైతులు ప్రభుత్వం గుర్తించిన లైసెన్స్ విత్తన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని, విత్తనాలు( Seeds ) కొనుగోలు చేసే సమయంలో రైతులు తప్పనిసరిగా బిల్లు రశీదు తీసుకోవాలని, సీల్డ్ ప్యాకెట్లను మాత్రమే రైతులు కొనుగోలు చేయాలని విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎస్ సూచించారు.

ప్రతి రైతు వారిగా అవసరమైన విత్తనాల పై రిజిస్టర్ నిర్వహించాలని అన్నారు.వానకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు అవసరమయ్యే పచ్చి రొట్టె విత్తనాలు సైతం అందుబాటులో ఉంచాలని, వరి సన్న రకాల విత్తనాల స్టాక్ లు, పత్తి విత్తనాలలో అధికంగా ఉంచాలని తెలిపారు.

పత్తి విత్తనాలను రైతులకు అవసరమైన మేర అందుబాటులో ఉంచాలని, రైతులకు అవసరమైన రకాల విత్తనాలు అందుబాటులో లేని పక్షంలో త్వరితగతిన సదరు విత్తనాల స్టాక్ మార్కెట్ లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, మంచి విత్తనాలు రైతులు వినియోగించాలని అన్నారు.

జిల్లాలో ముందుగా ఎక్కడ వ్యవసాయ పనులు ప్రారంభమవుతుందో, ఎక్కడా నాట్లు వేస్తారో ఆ ప్రాంతాలలో ఎరువులు, విత్తనాలు అవసరమైన మేర అందుబాటులో ఉంచాలని, ఎక్కడ రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు.

నకిలీ విత్తనాల గురించి సమాచారం అందితే వెంటనే మీడియా ద్వారా రైతులను అప్రమత్తం చేయాలని, నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న వారి పై పిడి యాక్ట్ కింద కేసులో నమోదు చేయాలని సదరు సమాచారాన్ని సైతం మీడియాకు ఎప్పటికప్పుడు అందించాలని సీఎస్ సూచించారు.

వానాకాలం సాగులో రైతులకు అవసరమైన సలహాలు సూచనలు నిపుణుల ద్వారా అందచేందుకు రైతు నేస్తం కార్యక్రమం క్రింద రైతు వేదికల వద్ద ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్ సిస్టం పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సి.

ఎస్ అధికారులకు సూచించారు.వేసవికాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా త్రాగునీటిని విజయవంతంగా తరపున చేయడంలో అధికారులు సఫలీకృతులయ్యారని, ఇదే స్పూర్తితో రాబోయే 20 రోజులలో సైతం అప్రమత్తంగా ఉంటూ ప్రతి ఇంటికి త్రాగునీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

త్రాగునీటి సరఫరాను జిల్లా స్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని , ప్రతి ఇంటికి సరిపడా త్రాగునీరు సకాలంలో సరఫరా అయ్యేందుకు అవసరమైన చర్యలు కట్టుదిట్టంగా తీసుకోవాలని అన్నారు.

జిల్లా వ్యాప్తంగా మిషన్ భగీరథ త్రాగునీటి సర్ఫ్రా పై సర్వే నిర్వహించి నివేదికను సమర్పించాలని సిఎస్ సూచించారు.

జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటి సందర్శించి మిషన్ భగీరథ త్రాగునీటి సరఫరా స్థితి గతుల పరిశీలించి వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని సమర్పించాలని సీఎస్ పేర్కొన్నారు.

సింగల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని ప్రభుత్వం నిషేధించిందని, దీనిని క్షేత్రస్థాయిలో కట్టుదిట్టంగా అమలు చేయాలని, సింగల్ యూస్ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయక బట్ట సంచుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సిఎస్ పేర్కొన్నారు.

పాఠశాలలు పునః ప్రారంభానికి ముందే ప్రతి విద్యార్థికి రెండు జతల స్కూలు యూనిఫామ్ కుట్టించి అందజేయాలని సీఎస్ ఆదేశించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి( Mahender Reddy) మాట్లాడుతూ పకడ్బందీగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్లు నిర్వహించాలని, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 897 పరీక్ష కేంద్రాల్లో 4 లక్షల 3 వేలకు పైగా అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్ష రాయడం జరుగుతుందని, పరీక్ష సజావుగా నిర్వహించేందుకు కొత్తగా సీనియర్ అధ్యాపకులను, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్ ను రీజినల్ కోఆర్డినేటర్లుగా నియమిస్తున్నామని అన్నారు.

ప్రతి జిల్లాలో అదనపు కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తూ పరీక్ష సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని , అభ్యర్థుల బయోమెట్రిక్ పకడ్బందీగా తీసుకోవాలని, పరీక్ష కేంద్రాల్లోకి వచ్చే సమయంలో అభ్యర్థులను తనిఖీ చేసేందుకు అవసరమైన మేర సిబ్బంది నియమించాలని ఆయన పేర్కొన్నారు.

సీటింగ్ అరేంజ్మెంట్స్, రూం వారీగా హాల్ టికెట్స్ వివరాలను అభ్యర్థులకు కనబడే విధంగా ప్రదర్శించాలని, అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలన చేసి ఉదయం 9.

00 గంటల నుండి పరీక్షా కేంద్రాల లోనికి ప్రవేశం కల్పించాలని, అభ్యర్థులు ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడి కార్డు, హాల్ టికెట్ లు చూపించి పరీక్షా కేంద్రంలోకి వెళ్లే విధంగా చూడాలని, పరీక్షా కేంద్రాలలో సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదనీ తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ జిల్లాలో 4699 మంది అభ్యర్థులు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాయడం కోసం 15 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే, జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ 9398684240 నెంబర్ ఏర్పాటు చేశామని తెలిపారు.

ఆ స్టార్ హీరోతో డేటింగ్ గురించి త్రిష క్లారిటీ ఇదే.. వాళ్ల నోర్లు మూయించిందిగా!