ముప్పేట దాడిని తట్టుకొని అనిల్ నిలబడగలరా?

వైసిపి( YCP )లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న కొద్దిమంది నాయకుల లో నెల్లూర్ సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్( Anil Kumar ) కూడా ఒకరు.

అసెంబ్లీలో తొడగొట్టడాలు , సవాలు చేయడాలు , మీసం మెలెయ్యడాలు ఇలా ఒక ప్రజాప్రతినిధి ఏం చేయకూడదో అన్నీ చేస్తూ ఫేమస్ అయ్యారు .

పోలవరం ప్రాజెక్టుకి డెడ్ లైన్ కూడా ప్రకటించి అది వికటించడంతో సైలెంట్ అయిన మంత్రి గారు పదవి ఉన్నంతవరకు ప్రతిపక్షాలపై ఒక రేంజ్ లో సౌండ్ చేసి అది పొగానే ఇప్పుడు దాదాపుగా సైలెంట్ గానే ఉంటున్నారు.

అయితే పరిస్థితులు మాత్రం ఆయనకు వ్యతిరేకంగా రోజురోజుకీ మారుతున్నాయట .ఇప్పటికే వైసీపీ నుంచి సస్పెండ్ కాబడిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ( Kotam Reddy Sridhar Reddy )వర్గం నుండి అని కు ముప్పు పొంచి ఉందని వార్తలు వినిపిస్తున్నాయి .

"""/" / టిడిపి నుంచి నెల్లూరు రూరల్ టికెట్ శ్రీధర్ రెడ్డి కి కన్ఫర్మ్ అయ్యిందని సమాచారం అంతేగాకుండా ఆయన తమ్ముడు గిరిధర్ రెడ్డి అనిల్ నియోజకవర్గం అయిన నెల్లూరు సిటీ టికెట్ టిడిపి నుంచి కేటాయిస్తారు అన్న వార్తలు అనిల్ క్యాంపులో ఆందోళన రేపుతున్నాయి.

బలమైన గిరిధర్ వర్గం ఇక్కడ చక్రం తిప్పితే అనిల్ కు గెలుపు కష్టమే అని అంచనాలు ఉన్నాయి.

అంతే కాకుండా మంత్రి పదవి అండ చూసుకొని సొంత పార్టీ నేతలతోనే చాలామందితో కయ్యం పెట్టుకున్న అనిల్ వోటమి కోసం కంకణం కట్టుకున్నారట కొంతమంది నాయకులు.

తన ప్రవర్తనతో సామాజిక వర్గంలో కూడా ప్రజావ్యతిరేకత మూట కట్టుకున్న అనిల్ కు ఇప్పుడు సొంత నాయకులు, కార్యకర్తలు కూడా వ్యతిరేకంగా మారడంతో ఈసారి గెలుపు పై నమ్మకం పార్టీ శ్రేణులకు కూడా లేదట .

"""/" / అంతేకాకుండా మొదటి నుంచి వైరి వర్గమైన కాకాని గోవర్ధన్ వర్గం కూడా అనిల్ వోటమి కోసం వెనకనుంచి చక్రం తిప్పుతుందని వార్తలు వస్తున్నాయి.

అనిల్ కు మంత్రి పదవి తొలగించి గోవర్ధన్ రెడ్డికి ఇచ్చినప్పటినుంచి వీరి వర్గాల మధ్య ఆదిపత్య దాడులు కూడా జరుగుతున్నాయి.

మరి ఇలా ముప్పేట నుంచి వస్తున్న వ్యతిరేకత ను తట్టుకొని ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకొని ఈ ఎన్నికల లో గట్టెక్కగలరా అంటే కష్టమనే చెప్పాలి తన గెలుపు పై అనిల్ దీమగా ఉన్నప్పటికీ వాస్తవంలో ఇది ఏ మేరకు సాధ్యమవుతుందో అన్నది అతిపెద్ద ప్రశ్న.

జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు చూసి అలా కామెంట్లు చేసిన పవన్ కళ్యాణ్.. ఏం చెప్పారంటే?