పెరుగుతున్న చలి తీవ్రతతో అవస్థలు…!

నల్లగొండ జిల్లా:రోజు రోజుకు పెరుగుతున్న చలి తీవ్రతను తట్టుకోలేక ఆరు దాటిందంటే పిల్లలు, యువకులు,వృద్ధులు, మహిళలు ఇండ్లకే పరిమితమవుతున్నారు.

చలిపంజా నుండి తట్టుకునేందుకు చలి మంటలు వేసుకొని యువకులు చలి కాగుతున్నారు.

గత 4 రోజుల నుండి 8 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో పిల్లలు, వృద్ధులు చలిని తట్టుకోలేక వామ్మో చలి.

అని ముసుగేసుకొని పడుకుంటున్నారు.చలి తీవ్రతను తట్టుకునేందుకు స్వెటర్లు,మంకీ క్యాప్‌లు ధరించినప్పటికీ చలిని తట్టుకోలేని కొందరు ఉదయం పూట పనులు,ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు.

రైతులకు రాత్రివేళల్లో చలి‘పులి’ని లెక్కచేయకుండా వ్యవసాయ పనులకు వెళ్తున్నారు.రాత్రి 7 గంటల తర్వాత,ఉదయం 7 గంటల వరకు రోడ్లు నిర్మాణుష్యంగా మారిపోతున్నాయి.

ఒక వేళ యువకులు ఇంటి నుండి బయటకు వచ్చినా ఏదో ఒక చోట చలి మంటలు కాచుకునేందుకు గుమిగూడుతున్నారు.

పిల్లలు,వృద్ధులు ఇంటి నుండి బయటకు రాలేకపోతున్నారు.రానున్న మరో నాలుగైదు రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని శాస్తవ్రేత్తలు వెల్లడిస్తున్న నేపథ్యంలో వామ్మో చలిపులి తట్టుకునేదెలా అంటూ భయంతో జనం వణికిపోతున్నారు.

అన్నదాతలకు యాసంగి సీజన్ లో ఆదిలోనే హంస పాదం ఎదురైతుంది.ఆరుగాళ్ళం ఎంతో కష్టపడి పంటలు పండించే రైతన్న చలి తీవ్రతతో పంటలు ఏనుకోక అవస్థలు పడుతున్నారు.

నల్లగొండ జిల్లా వేములపల్లి, మాడుగులపల్లి మండలాల్లో గత పది రోజులుగా వరి నాట్లు వేసిన పంట పొలాలు చలి తీవ్రతతో ఎదుగుదల లేకుండా వేసిన నాట్లు వేసినట్టుగానే ఉంటున్నాయి.

పంట పొలాల ఎర్రగా మారి మొత్తం ఏనుకోకుండా చనిపోతున్నాయి.ఫర్టిలైజర్ పరంగా ఎన్ని మందులు వాడినా లాభం లేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వ్యవసాయ అధికారులు స్పందించి పంట పొలాలను పరిశీలించి రైతులకు తగు సూచనలు ఇచ్చే విధంగా చూడాలని రైతులు కోరుకుంటున్నారు నేను పదిహెను రోజుల కింద 5 ఎకరాల నాటు వేశాను.

నాటు వేసిన నుండి ఇప్పటివరకు వేసిన నాటు ఎలా ఉందో అలానే ఉంది.

ఎన్ని రకాల మందులు వాడినా కొంచెం కూడా ఏనుకోవడం లేదని, పొలం మొత్తం ఎర్రగా మారి పూర్తిగా చనిపోయిందని,ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు పంట పొలాలు పరిశీలించి తగు సూచనలు సలహాలు ఇవ్వాలని గోలి పుల్లారెడ్డి అనే రైతు కోరుతున్నారు.

దీనికై అగ్రికల్చర్ అధికారిణి ఏడిఏ నాగమణిని వివరణ కోరగా నీటిపారుదల యాజమాన్య పద్ధతులు పాటించాలని,అగ్గి తెగులు ట్రైక్లోన్ జెల్ 0.

6 గ్రాములు లీటర్ నీటికి చొప్పున పిచికారి చేయాలని, కాండం తొలుచు పురుగుకు సర్ ల్యాబ్ హైడ్రో క్లోరైడ్ 50 ఎస్పి ఒక ఎకరానికి 250 గ్రాములు స్ప్రే చేసుకోవాలని,12% 2 ఎంసి ఒక ఎకరానికి 100 గ్రాములు వాడాలని, వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి సలహాలు,సూచనలు కావాలన్నా అందుబాటులో ఏవో, ఏఈవోలను ఫోన్ ద్వారా అడిగి సమాచారం తెలుసుకోగలరని సూచించారు.

భారతీయుడు2 సినిమాను నిజంగా శంకర్ డైరెక్ట్ చేశారా.. ఇంత చెత్త సినిమాను ఊహించలేదుగా!