ముగిసిన భారతీయ కిసాన్ సాంగ్ తెలంగాణ రాష్ట్ర సర్వసభ్య సమావేశం
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నర్సింగాపూర్ లో భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని రాష్ట్ర అధ్యక్షులు జోగినపల్లి రంగారావు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల అధ్యక్షులు అఖిలభారత రైతు సంఘం నాయకులు హాజరయ్యారు.
రెండు రోజులపాటు జరిగిన సమావేశం లో రైతు సమస్యలపై చర్చించారు .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి ధాన్యం కొన్న వెంటనే రైతులకు డబ్బులు చెల్లించాలని ఇప్పటివరకు కూడా కొనుగోలు కేంద్రాల్లో దాన్యం ఉన్నదని అన్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి ధాన్యాన్ని కొనాలని ఎలాంటి కటింగ్ చేయొద్దని డిమాండ్ చేశారు.
రైతు బీమా లేకపోవడం వల్ల చాలామంది రైతులు నష్టపోయారని వచ్చే పంట వరకు రైతు బీమా సౌకర్యం కల్పించాలని అన్నారు.
ధరణి తో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.అటవీ ప్రాంతం లో అడవి జంతువులు పంట ను నష్టం చేస్తే నష్ట పరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రధాన కార్యదర్శి మోహిని మోహన్ మిశ్ర , అఖిల భారత కార్యదర్శి సాయి రెడ్డి, రాష్ట్ర ప్రబారి నాన ఆక్రే, అఖిలభారత కార్యవర్గ సభ్యులు ముదిగంటి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి రాజిరెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు పులి లక్ష్మీపతి గౌడ్, జోనల్ అధ్యక్షుడు జోగినపల్లి సంపత్ రావు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పోరెడ్డిసంజీవ్ రెడ్డి లతో పాటు పలు జిల్లాల అధ్యక్షులు ఉన్నారు.
ఏపీ టెట్ పరీక్షలో 150కు 150 మార్కులు.. అశ్విని సక్సెస్ స్టోరీకి గ్రేట్ అనాల్సిందే!