బడ్జెట్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన ఎన్నారై వెల్ఫేర్ ట్రస్ట్ ఛైర్మన్!!

యూఏఈలో నివసిస్తున్న నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRIs) కోసం, భారత బడ్జెట్ 2023లో చేసిన ప్రకటనలు పెద్దగా వారి పర్సనల్ ఫైనాన్స్ లో మార్పులు తీసుకు రాకపోవచ్చు.

దీంతో ఈ బడ్జెట్ ప్రకటనల కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన ఎన్నారైలంతా బాగా నిరాశకు గురయ్యారు ఈ నేపథ్యంలోనే యూఏఈకి చెందిన ప్రవాసీ బంధు వెల్ఫేర్ ట్రస్ట్ ఛైర్మన్ K.

V.శంసుధీన్ బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

భారతదేశం వెలుపల నివసిస్తున్న ఎన్నారైలు అని కూడా పిలిచే ప్రవాస భారతీయుల బాధలను ఇబ్బందులను బడ్జెట్‌లో ప్రస్తావించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

"""/"/ 2022లో 100 బిలియన్ల డాలర్లను భారతదేశానికి పంపిన 40 మిలియన్ల ఎన్నారైలు ఉన్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఈ డబ్బులో ఎక్కువ భాగం మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలో నివసిస్తున్న తక్కువ, మధ్య-ఆదాయ ఎన్నారైలు పంపారని పేర్కొన్నారు.

ఇలా తమ వద్ద ఎక్కువగా డబ్బులు ఉంచుకోకుండా భారతదేశానికే పంపే ఎన్నారైల భవిష్యత్తుకు ఆర్థిక రక్షణ కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉందన్నారు.

"""/"/ తమ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకునేందుకు పెట్టుబడి ప్రణాళికను రూపొందించాలని భారత ప్రభుత్వాన్ని ఎన్నారైలు ఎప్పటినుంచో కోరుతున్నారు.

ఇలాంటి ఎన్నారైల కోసం మ్యూచువల్ ఫండ్లలో ప్రభుత్వం ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌‌మెంట్ ప్లాన్స్‌ ప్రారంభించవచ్చని K.

V.శంసుధీన్ సూచించారు.

దీంతో వారు సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతారని అభిప్రాయపడ్డారు.బ‌డ్జెట్‌లో బ‌ల‌హీన‌మైన వ‌ర్గాలు అంటే కేవలం మ‌హిళ‌లు, ప‌ర్యాట‌కులు, చేతివృత్తుల వారికి సాయం చేయ‌డంపై దృష్టి సారిస్తోంద‌ని ఆయ‌న అన్నారు.

ప్రవాసుల గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు.

తారక్ పేరెత్తడానికి కూడా ఇష్టపడని బాలకృష్ణ.. తమ హీరో అంత తప్పేం చేశాడంటూ?