శాసనసభలో టీడీపీ సభ్యుల ఆందోళన
TeluguStop.com
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా శాసనసభలో టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు.
బడ్జెట్ ప్రసంగానికి అడ్డుపడటంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.ఈ క్రమంలో వినలేకపోతే సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యులకు సూచించారు.
స్పీకర్ పోడియం చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు పేపర్లు విసిరారు.దీంతో సభ నుంచి 14 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు.
మరోవైపు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆందోళన సరికాదని సీఎం జగన్ అన్నారు.బడ్జెట్ ప్రసంగానికి అడ్డుపడటం సరికాదన్నారు.
ఈ ప్రసంగాన్ని రాష్ట్రం మొత్తం చూస్తోందని తెలిపారు.