కేసీఆర్ ఫామ్ హౌజ్ ముందు డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల ఆందోళన

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( Former CM KCR ) ఫామ్ హౌజ్ ముందు డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు.

గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల( DOuble Bed Room Houses ) కేటాయింపు పారదర్శకంగా జరగలేదని ఆరోపించారు.

ఈ క్రమంలో నిరసనకు దిగిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ వాసులు అర్హులైన వారికి అన్యాయం చేశారని వాపోయారు.

లక్కీ డ్రా ద్వారా సుమారు 1100 మందిని గత ప్రభుత్వం ఎంపిక చేసినప్పటికీ ఇప్పటివరకు తమకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందలేదని తెలిపారు.

ఈ క్రమంలోనే ఎర్రబెల్లి వ్యవసాయ క్షేత్రంలోని కేసీఆర్ ఫామ్ హౌజ్( KCR Farm House ) వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసుల నిరసనకారులకు సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ఓరి దేవుడా.. సిటీ స్కాన్ రిపోర్టు చూసి అబ్బురపోయిన డాక్టర్లు..