గేమ్ ఛేంజర్: చిన్న బ్యాటరీతో పవర్ అవసరం లేకుండా కంప్యూటర్ ని 6 నెలలు పైగా రన్ చేశారు!

ఇదేంటి ఒక కూలర్ బాక్స్ లాగా కనిపిస్తుంది.ఇది బేటరీనా అని అనుమానించొద్దు.

మీ అనుమానం కరక్టే.ఇదొక బ్యాటరీ అన్నది అక్షర సత్యం.

ఓ 6 నెలల పాటు కరెంటు ఇచ్చే విధంగా శాస్త్రవేత్తలు దీనిని రూపొందించారు.

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ ప్రాసెసర్‌కి ఈ బ్యాటరీని కనెక్ట్ చేయగా ఇది 6 నెలల పాటు నిరంతరాయంగా పని చేసింది, ఇంకా పని చేస్తూనే వుంది.

ఈ బ్యాటరీ షెల్ AA బ్యాటరీ కంటే చిన్నది కావడం విశేషం.పరిశోధనలో భాగంగా బ్లూ-గ్రీన్ ఆల్గేను ఎలక్ట్రోడ్‌ల తో కూడిన కంటైనర్‌లో ఉంచారు.

విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి సూక్ష్మజీవులు సూర్యరశ్మిని ఉపయోగించాయి.దాంతో ఈ బ్యాటరీ కంప్యూటర్‌ను నడపడానికి తగినంత శక్తిని ఇచ్చింది.

జర్నల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ ప్రకారం, సైనోబాక్టీరియా కంప్యూటర్‌ను 45 సైకిల్స్‌లో అమలు చేసేందుకు అనుమతించింది.

ఇది కేవలం15 నిమిషాల్లోనే రెడీ అయింది.ఆగస్ట్ 2021 నుంచి బ్యాటరీ విద్యుత్తును ఉత్పత్తి చేయడం కొనసాగిస్తూనే ఉంది.

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని బయోకెమిస్ట్రీ విభాగానికి చెందిన డాక్టర్ పాలో బొంబెల్లి మాట్లాడుతూ, సిస్టమ్ చాలాకాలం పాటు నిరంతరాయంగా పనిచేసింది.

ఇది కొన్ని వారాల తర్వాత ఆగిపోవచ్చని అనుకున్నాం.కానీ, అది కొనసాగుతూనే ఉంది.

6 నెలలపాటు అంతరాయం లేకుండా నడిచిన ఈ సిస్టమ్, కంప్యూటింగ్ సమయంలో 0.

3 మైక్రోవాట్‌ల శక్తిని, పనిలేకుండా ఉండే సమయంలో 0.24 శక్తిని వినియోగించుకుంది.

"""/"/ కిరణజన్య సంయోగక్రియ సమయంలో సైనోబాక్టీరియా ఎలక్ట్రాన్‌లను విడుదల చేస్తుందని, కానీ వెలుతురు లేకపోవడంతో విద్యుత్‌పై ప్రభావం పడలేదని అన్నారు.

ఆల్గే తమ ఆహారాన్ని చీకటిలో ప్రాసెస్ చేయడం దీనికి కారణం కావచ్చని అనుకుంటున్నారు.

విద్యుత్ ప్రవాహం ఉత్పత్తి ఇంకా కొనసాగుతూనే ఉంది.ఈ ఆల్గే-ఆధారిత బ్యాటరీలు ఇంటికి శక్తినివ్వడానికి ఇప్పటికైతే సరిపోవు.

అయినప్పటికీ అవి చిన్న ఉపకరణాలకు మాత్రం శక్తినివ్వగలవు.ఇది చౌకగా ఉంటుంది.

రీసైకిల్ చేసిన పదార్థాలతో తయారు చేశారు.ఇటువంటి బ్యాటరీలు రాబోయే కాలంలో గేమ్ ఛేంజర్‌గా మారగలవు అని ధీమా వ్యక్తం చేసారు.

పవన్ కళ్యాణ్ ను ఎలివేట్ చెయ్యాలంటే ఆ మ్యూజిక్ డైరెక్టరే బెస్ట్…