భద్రత విషయంలో రాజీపడం.. టీటీడీ ఈవో కామెంట్స్

తిరుమల తిరుపతి దేవస్థానం భద్రత విషయంలో ఎక్కడా రాజీపడేది లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు.

ఇప్పటికే శ్రీవారి ఆలయంపై డ్రోన్ కలకలం వివాదంపై కేసు నమోదు చేశామని తెలిపారు.

డ్రోన్ ఆపరేటర్లు అత్యుత్సాహంతో వీడియో తీసి ఉంటే మాత్రం చర్యలు తప్పవని చెప్పారు.

అదేవిధంగా త్వరలో తిరమలు యాంటీ డ్రోన్ టెక్నాలజీని తీసుకొస్తామని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.

అయితే శ్రీవారి ఆలయానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.

ప్రభాస్ తో సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అనిల్.. అలా చెప్పడంతో?