పుస్తక రూపంలో రైళ్ల గురించి పూర్తి సమాచారం.. ఆర్డర్ చేసుకోండిలా!
TeluguStop.com
రైల్వే ప్రయాణికులకు ఓ శుభవార్త.తాజాగా భారతీయ రైల్వే 3 సంవత్సరాల తర్వాత ఆల్ ఇండియా రైల్వే టైమ్ టేబుల్‌ను రిలీజ్ చేసి పుణ్యం మూటకట్టుకొంది.
విషయం ఏమంటే, Trains At A Glance పేరుతో ఓ పుస్తకాన్ని ఈ సందర్భంగా రూపొందించి, విడుదల చేసింది.
గతంలో ఉన్న పుస్తకానికి ఇది అప్‌డేట్ వర్షన్ అని చెప్పుకోవచ్చు.ఇందులో ఉన్న టైమ్ టేబుల్ 2022 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది.
కాబట్టి రైల్వే ప్రయాణికులు భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్ అయినటువంటి Www!--indianrailways.gov!--in నుండి దానిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అంతేకాకుండా ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ వెబ్‌సైట్ అయినటువంటి !--wwwirctc.
Co!--in, IRCTC టూరిజం వెబ్‌సైట్ అయినటువంటి Http://!--wwwirctctourism!--com లల్లో TAG (ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్) ఇ-బుక్ కొనుక్కోవచ్చు.
ఇకపోతే ఈ బుక్ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో లభ్యమౌతోంది.ఇందులో ప్రచురించిన టైమ్ టేబుల్‌లో ట్రైన్ నెంబర్, టైమ్, షెడ్యూల్, రూట్ లాంటి వివరాలన్నీ కూలంకషంగా ఉంటాయి.
రైళ్ల సమయపాలన మెరుగుపరచడానికి టైమ్ టేబుల్‌లో అవసరమైన మార్పులు చేయడం చూడవచ్చును. """/"/
కోవిడ్‌కు ముందు ఉన్న టైం టేబులుతో పోలిస్తే మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయం దాదాపు 9% మెరుగుపడిందని చెప్పుకోవచ్చు.
ఈ పుస్తకంలో 400 పైగా కలర్ పేజీల్లో వివిధ వివరాలు పొందిపరచి ఉంటాయి.
ఇంకా ఇందులో టైమ్ టేబుల్ వివరాలతో పాటు రైల్వే టూరిజం, ముందస్తు రిజర్వేషన్, రైల్వే విచారణ, భోజనం మెను, తత్కాల్ రిజర్వేషన్, విదేశీయులకు ప్రత్యేక సౌకర్యాలు, అప్‌గ్రేడేషన్, ప్రయాణ ప్రణాళికలో మార్పులు, ఇంటర్నెట్ ద్వారా రిజర్వేషన్, లగేజీ బుకింగ్, రీఫండ్ రూల్స్, ప్రయాణికుల సౌకర్యాలు లాంటి అనేక వివరాలు ఉంటాయి.
మరిన్ని వివరాల కొరకు పైన తెలిపిన సైట్స్ చూడగలరు.
దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన ఈ 4 సినిమాలు చాలా స్పెషల్ గా నిలిచాయా..?