ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ఈడీకి ఫిర్యాదు

తెలంగాణ సంచలనంగా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ఈడీకి ఫిర్యాదు అందింది.

ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈడీ అధికారులను కలిశారు.మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో జోక్యం చేసుకోవాలని ఈడీ అధికారులను ఆయన కోరారు.

అదేవిధంగా రూ.100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చాలని కోరినట్లు సమాచారం.

ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.ఈ విషయంపై టీఆర్ఎస్, బీజేపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్11, బుధవారం 2024