ఫోన్ ట్యాపింగ్ పై ఈడీకి ఫిర్యాదు..!!
TeluguStop.com
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు అందింది.ఈ మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయవాది సురేశ్( Suresh ) ఈడీకి కంప్లైంట్ ఇచ్చారని తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు వ్యాపారులను బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారని లాయర్ సురేశ్ ఫిర్యాదులో ఆరోపించారు.
ఈ క్రమంలో పీఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆయన ఈడీని కోరారు.
ఈ కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదని సురేశ్ ఫిర్యాదులో వెల్లడించారు.
రాజమౌళి ఫస్ట్ లవ్ స్టోరీ మీకు తెలుసా.. ఈ విషయాలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!