అప్పుడే రోజా టార్గెట్ అయిపోయారా ? రంగంలోకి సీఐడీ
TeluguStop.com
ఏపీ అధికార పార్టీ టీడీపీ( TDP ) అప్పుడే తమ రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూనే దూకుడు ప్రదర్శిస్తోంది.
గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీమంత్రి ఆర్కే రోజాపై( Ex Minister RK Roja ) అనేక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా తిరుమలలో విఐపి దర్శనాల దగ్గర నుంచి, క్రీడల శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ఆ శాఖలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలపై తాజాగా సిఐడికి( CID ) ఫిర్యాదు అందింది.
ముఖ్యంగా ఆడదాం ఆంధ్ర( Aadudam Andhra ) పేరుతో వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
"""/" /
అప్పటి క్రీడల శాఖ మంత్రి రోజాతో పాటు, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి( Byreddy Siddharth Reddy ) పైన ఫిర్యాదు అందింది.
ఆర్కే రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా అవకతవకలకు పాల్పడ్డారనే ఫిర్యాదు అందింది.
దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తే అనేక అవినీతి వ్యవహారాలు బయటపడతాయని సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులో ఆత్య పాత్య సంఘం సీఈవో ఆర్డి ప్రసాద్ పేర్కొన్నారు.
స్పోర్ట్స్ కోటాలో అనేకమంది వైద్య , ఇంజనీరింగ్, ఐఐటీలలో ప్రవేశం పొందారని , వీటి పైన విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని సిఐడికి ఫిర్యాదు చేశారు. """/" /
అలాగే ఐదేళ్ల కాలంలో శాప్ అధికారులు అన్ని ఇంజనీరింగ్ పనుల్లో భారీగా అవకతవకలకు పాల్పడ్డారని , దీనిపై దర్యాప్తు చేయాలని ఆయన ఫిర్యాదులో కోరారు.
అవకతవకలను పరిశీలించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సిఐడి కి ఇచ్చిన ఫిర్యాదులు ఆర్డి ప్రసాద్ పేర్కొన్నారు.
ఈ వ్యవహారాలపై ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఉండడంతో, రోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సిఐడి విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇంకా అనేక శాఖల్లో జరిగిన అవకతవకలపై ఫిర్యాదులు , విచారణలు జరిగే అవకాశం కనిపిస్తోంది.
క్రిమినల్స్‌ని ఇలా కూడా తీసుకెళ్తారా.. ఈ పోలీస్ వీడియో చూస్తే నవ్వే నవ్వు…