కాంగ్రెస్, బీజేపీ మద్యనే అసలు పోటీ ?

తెలంగాణలో( Telangana ) పోలిటికల్ హీట్ తారస్థాయిలో కొనసాగుతోంది.అధికారం కోసం ప్రధాన పార్టీలు పందెం కోళ్ళలాగా పోటీ పడుతున్నాయి.

గత తొమ్మిదేళ్ల నుంచి అధికారంలో ఉన్న బి‌ఆర్‌ఎస్ మూడోసారి కూడా అధికారం చేజిక్కించుకునేందుకు సిద్దమౌతుంటే.

ఈసారి బి‌ఆర్‌ఎస్( Brs ) ను గద్దె దించి తాము అధికారం చేపట్టాలని కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈసారి ఎలక్షన్ ఫైట్ ఆసక్తికరంగా మారనుంది.అయితే కాంగ్రెస్( Congress ) మరియు బీజేపీ పార్టీలకు అధికారంలోకి వచ్చే సీన్ లేదని ఆ రెండు పార్టీలు కూడా రెండు మూడు స్థానాల కోసమే పోటీ పడుతున్నాయని బి‌ఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.

"""/" / నిజానికి బి‌ఆర్‌ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలలో ఎంతో కొంత నిజం లేకపోలేదు.

ఎందుకంటే గత ఆర్నెళ్ల కంటే ముందు బీజేపీ పార్టీ ( BJP Party )నానా హడావిడి చేసింది.

బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని, బి‌ఆర్‌ఎస్ తరువాతి స్థానం బీజేపీదేనని చెబుతూ వచ్చారు కమలనాథులు.

తీరా ఎన్నికల సమయానికి బీజేపీ పూర్తిగా డీలాపడి కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది.ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్ ను ఢీ కొట్టి నిలిచే పార్టీ కాంగ్రెసే అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

"""/" / రాష్ట్రంలో బి‌ఆర్‌ఎస్ తరువాత హడావిడి కూడా కాంగ్రెస్ పార్టీదే కనిపిస్తోంది.

దీంతో బీజేపీ మూడో స్థానానికి పడిపోయినట్లు తెలుస్తోంది.మొత్తం మీద బి‌ఆర్‌ఎస్ మొదటి స్థానంలో ఉంటే రెండు మూడు స్థానాల కోసం కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీల మద్య పోటీ గట్టిగా ఉన్నట్లు కనిపిస్తోంది.

దీంతో ఈ రెండు పార్టీల హడావిడి అంతా కూడా అధికారం కోసం కాదని ప్రత్యామ్నాయ పార్టీగా నిలబడేందుకే అనే వాదన కూడా వినిపిస్తోంది.

మొత్తానికి ఈసారి ఎన్నికలో గెలిచే పార్టీని అంచనా వేయడం విశ్లేషకులకు సైతం కొంత కష్టంగానే మారింది.

మరి అటు అధికారం కోసం ఇటు బి‌ఆర్‌ఎస్ ప్రత్యామ్నాయ స్థానం కోసం ఈసారి ఎన్నికలు కీలకంగా మరాయనేది రాజకీయ వాదులు చెబుతున్న మాట.

మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

కేసు విషయం లో అల్లు అర్జున్ మీద ఉచ్చు బిగుస్తోందా.? ఆయన అరెస్టు అవ్వబోతున్నారా..?