చంద్రయాన్-3తో పోటీపడ్డ లూనా-25 క్రాష్ ల్యాండింగ్.. బెడిసికొట్టిన రష్యా ప్లాన్..!
TeluguStop.com
భారతదేశానికి చెందిన ఇస్రో జూలై 14న చంద్రయాన్-3( Chandrayaan-3 ) ను చంద్రునిపై పరిశోధనలు చేసేందుకు అంతరిక్షంలోకి పంపించిన సంగతి మనందరికీ తెలిసిందే.
అయితే చంద్రునిపై భారత్ కంటే ముందుగా చేరి పరిశోధనలు చేయాలని రష్యా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
రష్యా పంపించిన స్పేస్ క్రాఫ్ట్ లూనా-25 చిట్టచివరి నిమిషంలో క్రాష్ ల్యాండింగ్ అవడంతో మిషన్ ఘోరంగా విఫలమైంది.
సాధారణంగా చంద్రునిపై ల్యాండింగ్ అయ్యే సమయంలో ఏ స్పేస్ క్రాఫ్ట్ అయినా తన వేగాన్ని నియంత్రించుకుని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి.
అలా నియంత్రించుకోవడంలో రష్యా( Russia ) అంతరిక్ష పరిశోధకులు పూర్తిగా విఫలమయ్యారు.దీంతో లూనా-25 అతివేగంగా చంద్రుని ఉపరితలాన్ని ఢీ కొట్టి ముక్కలైంది.
ఈ విషయాన్ని స్వయంగా రష్యా అధికారికంగా ప్రకటించింది.రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ కాస్మోస్( Rose Cosmos ) ఒక ప్రకటన విడుదల చేసింది.
లూనా-25 ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి.ఫలితంగా చందుని ఉపరితలంపై కుప్పకూలిపోయింది.
గతంలో 2019లో ఇస్రో పంపించిన చంద్రయాన్-2 ఏ విధంగా క్రాష్ ల్యాండింగ్ అయ్యిందో.
అచ్చం అలాగే లూనా-25 క్రాష్ ల్యాండింగ్ అవ్వడం జరిగింది. """/" /
రష్యా చంద్రునిపై ప్రయోగాలు చేసిన 47 సంవత్సరాల తర్వాత మళ్లీ పూనుకుంది.
లూనా-25( Luna-25 ) పేరుతో ఆగస్టు 10వ తేదీన ఈ అంతరిక్ష నౌక చంద్రుని వైపు దూసుకెళ్లింది.
రష్యా ఫార్ ఈస్ట్ రీజియన్ లో ది వోస్టోఖ్ని కస్మో డ్రోమ్ నుంచి ఈ రాకెట్ ను పంపించింది.
"""/" /
రష్యా కాలమానం ప్రకారం, శనివారం మధ్యాహ్నం 2:57 నిమిషాలకు చంద్రుని యొక్క దక్షిణ ధ్రువ ఉపరితలంపై లూనా-25 ల్యాండింగ్ అవ్వాల్సి ఉండేది.
అయితే ల్యాండింగ్ అవ్వడానికి కేవలం కొద్ది నిమిషాల ముందు ఈ రాకెట్ తో రష్యా శాస్త్రవేత్తలకు ఉన్న సంబంధాలు తెగిపోయాయి.
రష్యా శాస్త్రవేత్తలు సంబంధాలను పునరుద్దరించుకోవడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు.అయితే ఈ నౌక సాఫ్ట్ ల్యాండింగ్ అయి ఉండొచ్చని రష్యా శాస్త్రవేత్తలు భావించడం లేదు.
లూనా-25 నుంచి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం కానీ, డేటా కానీ అందలేదని రష్యా స్పష్టం చేసింది.
లూనా-25 చంద్రుని ఉపరితలాన్ని ఢీ కొట్టి పేలిపోయి ఉండొచ్చని రష్యా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
దీనిపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేకంగా ఓ ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిషన్ ను నియమించినట్లు రష్యా పేర్కొంది.
ట్రంప్ గెలుపు బైడెన్‌కు ముందే తెలుసా? కమలను ముంచేశారా? .. ఒబామా సన్నిహితుడి వ్యాఖ్యలు