సంక్రాంతి పోటీ మళ్లీ రిపీట్ కానుందా.. చిరంజీవి, బాలయ్య మధ్య మళ్లీ పోటీ అంటూ?

2023 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య( Veerasimha Reddy, Waltheru Veeraya ) సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి.

రెండు సినిమాలు ఒకే బ్యానర్ లో తెరకెక్కగా ఈ రెండు సినిమాలలో ఒకరే హీరోయిన్ గా నటించగా ఈ రెండు సినిమాలు ఫుల్ రన్ లో 230 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి.

చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్ లో భోళా శంకర్ సినిమా తెరకెక్కుతుండగా ఆగష్టు 11వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

అయితే ఈ సినిమాలోని చాలా సీన్లు పెండింగ్ లో ఉన్నాయని ఈ సినిమా దసరాకు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

దసరాకు విడుదల కావాల్సిన బోయపాటి రామ్ కాంబో మూవీ ఆగష్టు 11కు షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

చిరంజీవి, బాలయ్య మళ్లీ బాక్సాఫీస్ వద్ద పోటీ పడే ఛాన్స్ ఉండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

"""/" / భోళా శంకర్, బాలయ్య అనిల్ రావిపూడి( Anil Ravipudi ) కాంబో మూవీ, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి.

ఈ మూడు సినిమాల బడ్జెట్లు 300 కోట్ల రూపాయల రేంజ్ లో తెరకెక్కుతుండటం గమనార్హం.

భోళా శంకర్ సినిమాతో మెహర్ రమేష్( Meher Ramesh ) కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాల్సి ఉందనే సంగతి తెలిసిందే.

మరోవైపు అనిల్ వరుస విజయాలతో కెరీర్ పరంగా బిజీగా ఉండగా ఈ సినిమా మరో సక్సెస్ అందిస్తుందని భావిస్తున్నారు.

"""/" / టైగర్ నాగేశ్వరరావు సినిమాకు వంశీ డైరెక్షన్ కాగా ఈ సినిమాలో గూస్ బంప్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

సంక్రాంతి పోటీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటే మాత్రం ఈ మూడు సినిమాలకు థియేటర్ల విషయంలో సైతం ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.