దేశం పేరును ఉగ్రవాద సంస్థతో పోల్చడం సరికాదు: ఖర్గే

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఏఐసీసీ ప్రెసిడెంట్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఇండియా కూటమిపై ప్రధాని దాడి చేస్తున్నారని విమర్శించారు.దేశం పేరును ఉగ్రవాద సంస్థతో పోల్చడం సరికాదని ఖర్గే తెలిపారు.

పన్నుల రాబడిలో రాష్ట్రాల వాటాను తిరస్కరించారని పేర్కొన్నారు.ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు బకాయిలు ఇవ్వడం లేదని చెప్పారు.

ఇండియా కూటమి బలం చూసి బీజేపీ భయపడుతోందని వెల్లడించారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమి ముంబైలో ఇవాళ రెండో రోజు సమావేశమైన సంగతి తెలిసిందే.