అడవి శేషు రెండు సినిమాలలో.. ఈ కామన్ పాయింట్ గమనించారా?
TeluguStop.com
ప్రస్తుతం యువ హీరో అడవి శేషు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు.
తాను ఎంచుకుంటున్న కథలతో ప్రేక్షకులలో ఈ హీరో నమ్మకాన్ని కలిగిస్తున్నాడు.అంతేకాదు ఇక అడవి శేషు నటించిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుంది అన్న విషయం తెలిసిందే.
క్షణం,అమీతుమీ, గూడచారి, ఎవరు సినిమాలతో ఇప్పటికే వరుసగా సూపర్ హిట్ ను అందుకున్నాడు అడవి శేష్.
ఇక త్వరలో మేజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అనే విషయం తెలిసిందే.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.భారతీయులు ఎవ్వరికి తెలియని కథను ఇక మేజర్ సినిమా ద్వారా చూపించేందుకు సిద్ధమయ్యాడు అడవి శేషు.
సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.
ఇక జూన్ 3వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.ఇక ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి అని చెప్పాలీ.
ఇటీవలే విడుదలైన ట్రైలర్ కూడా మంచి విజయం సాధించింది.అయితే ప్రస్తుతం అడవి శేషు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు.
"""/"/
మేజర్ సినిమా విడుదలైన వెంటనే అటు నాని నిర్మాతగా తెరకెక్కిన హిట్ - ది సెకండ్ కేసు సినిమా కూడా జూలై 29 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇప్పటికే విడుదలైన హిట్ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని సాధించింది.
ఇక ఇప్పుడు హిట్ 2 పై భారీ అంచనాలు పెరిగిపోయాయి.అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మేజర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సాయి మంజ్రేకర్, హిట్ సినిమాలో నటిస్తున్న మీనాక్షి చౌదరి ఇద్దరికి కూడా అడవి శేషు తో నటించిన సినిమా వారి కెరీర్లో మూడో సినిమా కావడం గమనార్హం.
దబాంగ్ 3, గని తర్వాత సయి మంజ్రేకర్ మేజర్ సినిమా చేస్తోంది.ఇక్కడ వాహనాలు నిలుపరాదు, ఖిలాడీ సినిమాల తర్వాత హిట్ 2 సినిమలో సందడి చేస్తోంది మీనాక్షి చౌదరి.
ఇకఈ మూడో సినిమా ఈ ముద్దుగుమ్మల కెరీర్ కి ఎలా ప్లస్ అవుతుందో చూడాలి.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్25, బుధవారం 2024