మోహన్ బాబు, సాయి పల్లవిల మధ్య ఉన్న ఈ కామన్ పాయింట్స్ గమనించారా..??

కలెక్షన్ కింగ్, టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు ఇప్పటికే 500కు పైగా చిత్రాలలో నటించి మెప్పించాడు.

హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా యాక్ట్ చేశాడు.పెదరాయుడు సినిమాలో అతడి నటనకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.

ఈ హీరో చాలా వెరైటీగా డైలాగులు చెబుతాడు.నవ్వించాల్సిన చోట నవ్విస్తాడు, ఏడిపించాల్సిన చోట ఏడిపిస్తాడు.

నవరసాలను పలికించగలడు.అయితే ఇంత గొప్ప హీరోకి, టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవికి మధ్య కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి.

అవేంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు.h3 Class=subheader-style• సినిమాల పట్ల ఫుల్ డెడికేషన్/h3p నటుడు మోహన్ బాబు( Mohan Babu ) లాగానే హీరోయిన్ సాయి పల్లవి( Sai Pallavi ) కూడా సినిమాల పట్ల చాలా డెడికేషన్ చూపిస్తుంది.

చెప్పిన టైంకి తప్పనిసరిగా వీళ్ళు షూటింగ్ కి వస్తారు.అలాగే డైరెక్టర్ చెప్పినట్లు నటిస్తారు.

ఎన్ని రీటేక్స్ అడిగినా చేస్తామని చెబుతారు.నిజానికి సాయి పల్లవి సహజనటి.

ఆమె కొన్ని రీటేక్స్ లోనే సీన్లను ఓకే చేస్తుంది.మోహన్ బాబు కూడా అంతే అని అంటారు.

"""/" / H3 Class=subheader-style• డబ్బు కోసం యాడ్స్ చేయరు/h3p సాయి పల్లవి ఎన్ని డబ్బులు ఇస్తానన్నా కూడా యాడ్స్( Ads ) లో నటించడానికి ఇష్టపడదు.

ఓ ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ లో నటిస్తే కోట్లు ఇస్తామని ఒక కంపెనీ ఆఫర్ ఇచ్చింది.

కానీ సాయి పల్లవి దాన్ని రిజెక్ట్ చేసింది.మోహన్ బాబు కూడా తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఒక యాడ్ చేయమని అడిగినప్పుడు దాన్ని సింపుల్ గా రిజెక్ట్ చేశాడట.

"""/" / H3 Class=subheader-style• నెపోటిజానికి వ్యతిరేకం/h3p సాయి పల్లవి తన చెల్లెలు పూజా కన్నన్ ( Pooja Kannan )సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు ఎలాంటి సపోర్ట్ అందించలేదు.

తనకొచ్చిన పాపులారిటీని ఉపయోగించుకోకుండా సొంతంగా నువ్వే పేరు తెచ్చుకోవాలి అని ఆమెకు నిర్మొహమాటంగా చెప్పిందట.

పూజ గురించి సాయి పల్లవి ఎక్కువగా ప్రమోషన్స్ కూడా చేయలేదు.మోహన్ బాబు కూడా తన కుమారులకు సపోర్ట్ అందించలేదు.

సొంతంగా మీరే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటూ వారికి చెప్పాడు.ఆ విధంగా మోహన్ బాబు, సాయి పల్లవి మూడు విషయాల్లో ఒకేలాగా ఉన్నారు.

సాయి పల్లవి ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో చాలా బిజీగా గడుపుతోంది.

మోహన్ బాబు కన్నప్ప సినిమాతో అలరించనున్నాడు.

చైనాలో ఘోర యాక్సిడెంట్.. స్కూల్ పిల్లలపైకి దూసుకెళ్లిన బస్సు.. 11 మంది మృతి..