కామన్ మ్యాన్ : ఈ మధ్య కొంతమంది పాపులారిటీ కోసం క్యాస్టింగ్ కౌచ్ బాధితులమని అంటున్నారటగా…

గత కొద్ది కాలంగా తెలుగు సినీ పరిశ్రమలో ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ అనే విషయం బాగానే కలకలం సృష్టిస్తోంది.

దీనికి తోడు ఈ మధ్య కాలంలో "మీటూ ఉద్యమం" పై అందరికీ బాగానే అవగాహన పెరగడంతో కొందరు నటీనటులు ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు గురించి  మీడియా ముందుకు వచ్చి వెల్లడిస్తున్నారు.

అయితే తాజాగా "సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపులు" అనే అంశంపై  కామన్ మ్యాన్  "రాజశేఖర్" అనే వ్యక్తిని ఓ ప్రముఖ మీడియా వెబ్ సైట్ ఇంటర్వ్యూ చేసింది.

ఇందులో భాగంగా కామన్ మ్యాన్ రాజశేఖర్ సినిమా పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు గురించి స్పందిస్తూ సమాజానికి ఉపయోగపడే విషయం ఏదైనా సరే ప్రజలు అప్పుడప్పుడు సినిమాల నుంచి నేర్చుకుంటారని అలాంటి చిత్ర పరిశ్రమలో మహిళలు లైంగిక వేధింపులకు గురికావడం బాధాకరమని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే  ఈ మధ్య కాలంలో కొందరు నటీనటులు తాము అవకాశాల కోసం పలానా దర్శకుడు లేదా నిర్మాతల దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు లేదా ఆమె కమిట్మెంట్ అడిగినట్లు చెబుతున్నారు.

 కానీ ఆ వ్యక్తి పేరును మాత్రం బయట పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించాడు.

అంతేగాక సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నటువంటి వ్యక్తుల వివరాలు బయటికి చెప్పడంతో ఇతర నటీనటులకు ఎంతో మేలు చేసినవారవుతారని, అలాగే ఇలాంటి వారిపై ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేస్తే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య కొందరు పాపులర్ కావడం కోసం తాము కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితులుమని అంటూ ఎలాంటి ఆధారాలు చూపించకుండా కామెంట్లు చేస్తున్నారని ఇలా చేయడం వల్ల పూర్తి సినీ పరిశ్రమకే చెడ్డ పేరు వస్తుందని అభిప్రాయం చేశారు.

తాను ఈ మధ్యకాలంలోఎక్కువగా గమనించిన విషయం ఏంటంటే కొందరు అవకాశాల కోసం ఏకంగా కమిట్మెంట్లు ఇచ్చి చివరికి వారు కమిట్మెంట్ ఇచ్చినటువంటి దర్శక నిర్మాతలు లేదా మరెవరైనా సరే అవకాశాలు ఇవ్వక పోవడంతో మీడియా ముందుకు వచ్చి క్యాస్టింగ్ కౌచ్ భాదితులమని చెప్పుకుంటున్నారని ఇది సరికాదని అన్నారు.

అలాగే ఏదో ఆశించి ఇష్ట పడి కమిట్మెంట్ ఇస్తే అది కాస్టింగ్ కౌచ్ సమస్య కాదని, ఒకవేళ కమిట్మెంట్ ఇచ్చిన తరువాత అవకాశాలు పొందినట్లయితే వీరు మీడియా ముందుకు వచ్చే వారు కాదని కూడా తెలిపాడు.

కాబట్టి  అవకాశాల కోసమో, డబ్బు కోసమో లేదా మరే ఇతర కారణాల వల్ల ఇష్ట పడి కమిట్ మెంట్ ఇస్తే అవి క్యాస్టింగ్ కౌచ్ సమస్యల కిందకి రావని కూడా తెలిపాడు.

H3 Class=subheader-styleనోట్ :/h3p "రాజశేఖర్" అనే వ్యక్తి కేవలం ఒక కామన్ మ్యాన్ మాత్రమే.

ఈ వ్యక్తికి ప్రచురిత వెబ్ సైట్ కి ఎలాంటి సంబంధం లేదు.అలాగే కామన్ మ్యాన్ రాజశేఖర్ క్యాస్టింగ్ కౌచ్ సమస్యపై చేసిన ఈ వ్యాఖ్యలకి ప్రచురిత వెబ్ సైట్ కి ఎలాంటి సంబంధం లేదు.

బన్నీ అరెస్ట్ అయితే జానీ మాస్టర్ హ్యాపీగా ఉన్నారా.. ఆయన రియాక్షన్ ఏంటంటే?