అదానీ వ్యవహారంపై కమిటీ నివేదిక.. సుప్రీం కీలక ఆదేశాలు
TeluguStop.com
అదానీ ఆర్థిక వ్యవహారాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ వేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది.
కమిటీ సభ్యులపై సీల్డ్ కవర్ లో పేర్లను అందిస్తామని కేంద్రం కోర్టుకు తెలిపింది.
ఈ మేరకు కమిటీ నివేదికను బుధవారం నాటికి సమర్పించాలని ధర్మాసనం పేర్కొంది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.
అయితే ఇన్వెస్టర్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం న్యాయస్థానం ఈ వ్యవహారంపై నిపుణుల కమిటీ ఏర్పాటుపై సెబీ, కేంద్రం అభిప్రాయాన్ని కోరిన సంగతి తెలిసిందే.
ఇండియాకు వచ్చిన ఫ్రెంచ్ సైకిలిస్టులకు గూగుల్ మ్యాప్స్ దిమ్మతిరిగే షాక్..