జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనపై కమిటీ భేటీ

దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనపై నిర్వహించిన కమిటీ తొలి సమావేశం ముగిసింది.

మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగిందన్న సంగతి తెలిసిందే.

కాగా ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తో పాటు గులాంనబీ ఆజాద్ హాజరయ్యారు.

ఇందులో భాగంగా జమిలి ఎన్నికలపై వాటాదారులు, రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలోనే ఏదైనా రాజకీయ పార్టీ కమిటీని కలిసి సూచనలు ఇవ్వొచ్చని సభ్యులు తెలిపారు.

అదేవిధంగా భారత ఎన్నికల సంఘం, న్యాయ కమిషన్ అభిప్రాయాలు సేకరించాలని కమిటీలోని సభ్యులు నిర్ణయించారు.

13 ఏళ్లకే పెళ్లి మాటెత్తిన డబ్బింగ్ జానకి.. ఆమె లవ్ స్టోరీతో సినిమా తీయొచ్చు..?