రాజధాని బిల్లు సెలక్షన్‌ కమిటీకి, అంటే ఏంటో తెలుసా?

అంతా ఊహించినట్లుగానే రాజధానుల విల్లును మండలి చైర్మన్‌ తిరష్కరించాడు.తెలుగు దేశం పార్టీకి ఎక్కువ మంది సభ్యులు ఉండటంతో పాటు, మండలి చైర్మన్‌ కూడా తెలుగు దేశం పార్టీకి చెందిన వ్యక్తి అవ్వడంతో ప్రభుత్వం పెట్టిన వికేంద్రీకరణ బిల్లును సెలక్షన్‌ కమిటీకి పంపిస్తున్నట్లుగా చైర్మన్‌ ప్రకటించాడు.

సెలక్షన్‌ కమిటీకి పంపించడం అనేది తెలుగు దేశం పార్టీ విజయంగా రాజకీయ వర్గాల వారు అంటున్నారు.

సెలక్షన్‌ కమిటీలో మండలిలో ఉన్న సభ్యుల అనుగుణంగా సభ్యులు ఉంటారు.అంటే సెలక్షన్‌ కమిటీలో కూడా తెలుగు దేశం పార్టీకి చెందిన వారు అధికంగా ఉంటారు.

సెలక్షన్‌ కమిటీ బిల్లుపై సుదీర్ఘంగా చర్చించి అభిప్రాయ సేకరణ చేస్తుంది.జనాలతో మాట్లాడటం, వారి నుండి అభిప్రాయాలు సేకరించడం చేస్తుంది.

అలా సేకరించి బిల్లులో మార్పులు చేర్పులు సూచించింది.ఆ మార్పులు చేర్పులతో అసెంబ్లీలో మళ్లీ బిల్లు వస్తుంది.

అసెంబ్లీలో మళ్లీ ఆ బిల్లును పాస్‌ చేసి మండలికి పంపిస్తారు.ఒక వేళ అసెంబ్లీలో మార్పులు చేర్పులు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా కూడా పంపే అధికారం ఉంటుంది.

రెండవ సారి మళ్లీ మండలికి వచ్చే బిల్లును సభ్యులు చర్చించి ఆమోదించాల్సి ఉంటుంది.

సెలక్షన్‌ కమిటీకి వెళ్లిన బిల్లును రెండవ సారి ఖచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుందని సభ్యులు అంటున్నారు.

అయితే ఇందుకు ఆరు నెలల నుండి సంవత్సరం వరకు సమయం పట్టనుంది.మొత్తానికి మూడు రాజధానుల విషయం సంవత్సరం వరకు వాయిదా పడ్డట్లే అంటున్నారు.

పల్నాడు జిల్లా మాచర్లలో హై టెన్షన్..!!