కేసీఆర్ ‘ధరణి’ దందా.. ప్రాజెక్టులతో కమీషన్ల ఒప్పందం: రాహుల్ గాంధీ!!
TeluguStop.com

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్‌తో సీఎం కేసీఆర్ దందా చేస్తున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు.


ప్రస్తుతం భారత్ జోడో యాత్ర సంగారెడ్డిలో కొనసాగుతోంది.మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.


‘సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌తో భూముల వ్యాపారం, ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు సంపాదిస్తున్నారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్, దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇద్దరూ ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారు.
పార్లమెంట్‌లో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు తెలిపింది.
సీఎం కేసీఆర్-ప్రధాని మోడీ ఇద్దరూ ఒక్కరే.ఆ విషయాన్ని ప్రజలు మర్చిపోవద్దు.
’ అని ఆరోపించారు.‘బీజేపీ ప్రభుత్వ హయాంలో గ్యాస్, ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి.
ధరలు పెరుగుతున్నా.సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు బీడీఎల్, బీహెచ్‌ఈఎల్ వంటి పరిశ్రమలు తీసుకొచ్చారు.భారత్ జోడో యాత్రకు భారీ మద్దతు లభిస్తోంది.
యాత్రలో పాల్గొంటున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు’ అని తెలిపారు.కాగా, రాహుల్ గాంధీ చేపట్టిన జోడోయాత్రలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది.
యాత్రలో భారీగా జన సందోహం పాల్గొన్నారు.ఈ క్రమంలో తోపుటాట చోటు చేసుకుంది.
రామచంద్రాపురం వద్ద మాజీ మంత్రి గీతారెడ్డి సొమ్మసిల్లి కిందకు పడిపోయారు.దీంతో అప్రమత్తమైన నాయకులు ఆమెను పైకి లేపారు.
"""/"/
క్రికెటర్‌గా అవతారమెత్తిన రాహుల్.భారత్ జోడో యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రజలతో ఉత్సాహంగా ఉంటున్నారు.
కార్యకర్తల్లో నూతనోత్సహం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.రాహుల్ గాంధీ క్రికెటర్‌గా అవతారమెత్తాడు.
5వ తరగతి చదివే యశోవర్ధన్‌తో కలిసి క్రికెట్ ఆడాడు.రాహుల్ గాంధీ బౌలింగ్ వేయగా.
యశోవర్ధన్ బ్యాటింగ్ చేశాడు.ఈ క్రికెట్ పోటీలో కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్ తదితరులు ఫీల్డింగ్ చేశారు.
అనంతరం రాహుల్ గాంధీ ఆ బాలుడికి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు.
మోక్షజ్ఞ విషయంలోనే ఇలా ఎందుకు అవుతుంది… కారణం ఏంటి..?