బీజేపీకి బూస్ట్ ఇస్తున్న టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అధికార, ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలతో పెద్ద ఎత్తున హీటెక్కుతున్న పరిస్థితి ఉంది.

ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ ను తిరిగి అధికారంలోకి రానివ్వకూడదనే ఉద్దేశ్యంతో రకరకాల వ్యూహాలు పన్నుతూ పెద్ద ఎత్తున రాజకీయాల్ని రణరంగంగా మార్చుతున్న పరిస్థితి ఉంది.

అయితే బీజేపీ తమంతట తాము కొన్ని అంశాల మీద విమర్శలు చేస్తున్న పరిస్థితుల్లో తాజాగా టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో బీజేపీకి మరింతగా  బూస్ట్ ఇచ్చినట్లు అవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అయితే  తాజాగా కంటోన్ మెంట్ లో ఉన్న కొన్ని రకాల నిబంధనల ద్వారా ప్రభుత్వ పాలనకు అభివృద్ది పనులకు అడ్డంకిగా మారుతున్నాయన్న విమర్శల నేపథ్యంలో తాజాగా కెటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయంగా సంచలనం రేపాయని చెప్పవచ్చు.

అయితే  కంటోన్ మెంట్ లో అధికారులు సహకరించకుంటే కంటోన్ మెంట్ కు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని కెటీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

దీనిపై బండి సంజయ్ పై స్పందిస్తూ ఒక్కసారి కంటోన్ మెంట్ కు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా బంద్ చేసి చూడాలని బంద్ చేశాక పరిస్థితులు ఎలా ఉంటాయనేది ప్రభుత్వం చూస్తుందని ఆర్మీ వాళ్ళకు మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

దీంతో ఇక మరోసారి బీజేపీకి టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి తమంతట తాముగా ఒక అస్త్రాన్ని ఇచ్చినట్టయింది.

అయితే మరల బీజేపీ విమర్శలపై కెటీఆర్ స్పందించకున్నా రానున్న రోజుల్లో సరైన సమయంలో స్పందించే అవకాశం కనిపిస్తోంది.

అయితే బీజేపీ టీఆర్ఎస్ చేస్తున్న ప్రతి ఒక్క తప్పును రాజకీయంగా బలపడటానికి చాకచక్యంగా వాడుకుంటున్న పరిస్థితి ఉంది.

మరి రానున్న రోజుల్లో బీజేపీ ఎలా ముందుకెళ్తుందనేది చూడాల్సి ఉంది.

దీపావళి రోజు కరెన్సీ నోట్లను కాల్చేసిన వ్యక్తి.. వీడియో వైరల్‌..