అమ్మాయికి క్యారెక్టర్ లేకపోతే సినిమా హిట్.. నేటి సినిమాలు ప్రూవ్ చేస్తోంది ఇదేనా?
TeluguStop.com
కొన్నేళ్ల క్రితం వరకు సినిమాలలో హీరో, హీరోయిన్ల పాత్రలను పాజిటివ్ గా చూపించేవారు.
విలన్లు మాత్రం చెడ్డ పనులు చేసేవారు.అయితే గత కొన్నేళ్లలో ప్రేక్షకుల అభిప్రాయాలు, అభిరుచులు మారిపోయాయి.
ఆర్.ఎక్స్100,( Rx 100 ) బేబీ సినిమాలలో అమ్మాయిల పాత్రలను మరీ దారుణంగా చూపిస్తూ అమ్మాయికి క్యారెక్టర్ లేకపోతే సినిమా హిట్ అనే అభిప్రాయాన్ని పరోక్షంగా కలిగిస్తుండటం గమనార్హం.
"""/" /
బేబి సినిమా( Baby Movie )లో హీరోయిన్ ఏ తప్పు చేయకముందే హీరో బూతులు తిట్టడం, హీరోయిన్ నోటి వెంట కూడా ఇష్టానుసారం బూతులు చెప్పేలా సన్నివేశాలు ఉండటం యూత్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపేలా ఉన్నాయని తెలుస్తోంది.
రాబోయే రోజుల్లో కూడా సినిమాలు ఇదే విధంగా తీస్తే ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించినా యూత్ పై ఆ సినిమాల ప్రభావం కొంతమేర పడే ఛాన్స్ అయితే ఉంది.
సమాజంలో 100 మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఉంటే 5 శాతం మంది అమ్మాయిలు, అబ్బాయిలు మోసం చేసే గుణం కలిగి ఉంటారు.
అయితే అందరూ తప్పు చేశారనే విధంగా సినిమాలను తెరకెక్కించడం కూడా సరికాదు.కొంతమంది క్రిటిక్స్ బేబీ సినిమా గురించి ప్రస్తావిస్తూ ఈ సినిమాను లవర్ తో కలిసి చూడొద్దని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
"""/" /
బేబి సినిమా ఫుల్ రన్ లో కమర్షియల్ గా మంచి లాభాలను అందించినా ఈ సినిమా క్లాసిక్ మాత్రం అనిపించుకోదు.
ఈ సినిమా క్లైమాక్స్ గురించి కూడా చాలామంది నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.
ప్రీ క్లైమాక్స్ లో హీరోయిన్ ఇద్దరూ ఎదురైనప్పుడు ఇచ్చిన ట్విస్ట్ తో సినిమాను ముగించి ఉన్నా ఈ సినిమాపై ఫీలింగ్ మరో విధంగా ఉండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
బేబి సినిమా 10 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని భోగట్టా.
గేమ్ ఛేంజర్ మూవీకి నెగిటివ్ ప్రచారం చేసింది వాళ్లేనా.. అసలేం జరిగిందంటే?