వృద్ధాశ్రమాన్ని సందర్శించిన సర్దాపూర్ కమాండెంట్

రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్ నందు గల 17వ పోలీస్ బెటాలియన్ కు చెందిన సి కంపెనీ సిబ్బంది, అధికారులు (ఆర్.

సి.కోర్స్) ఆన్యువల్ రిఫ్రెష్ కోర్సులో భాగంగా తంగళ్ళపల్లిలో ఉన్నటువంటి శ్రీనివాస చారిటబుల్ ట్రస్టు - లగిశెట్టి విశ్వనాథం స్మారక వృద్ధాశ్రమాన్ని సందర్శించడం జరిగింది.

ఈ సందర్భంగా 17వ బెటాలియన్ కమాండెంట్ యస్.శ్రీనివాసరావు సూచనల మేరకు ఆశ్రమం లో గల వృద్ధులకు పండ్లు, బియ్యం,దుప్పట్లు మరియు నిత్యవసర వస్తువులు అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ యమ్.పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ పోలీస్ అంటేనే సేవాభావంతో ఉంటారని తమ వంతు సహాయంగా నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది అని తెలిపారు.

 వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు వారితో  పోలీస్ సిబ్బంది కాసేపు గడపడం జరిగింది అని వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా పోలీస్ శాఖ నుంచి అందజేస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్.ఐ లు పి.

శ్రీనివాస్, సి.హెచ్ నేమాజీ, పోలీస్ బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

న్యాయం దక్కే వరకు నా పోరాటం ఆగదు.. మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!