నిశ్శబ్దం ఎఫెక్ట్‌ : ఇక ఓటీటీ రిలీజ్ లు ఉండవేమో

ఏడు నెలలుగా సినిమా థియేటర్లు ఓపెన్ కాని కారణంగా పలు సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా విడుదలైన ఏ ఒక్క సినిమా కూడా ఇప్పటి వరకు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నది లేదు.

అయినా కూడా సినిమాలను ఇప్పటి వరకు ఓటీటీ ద్వారా విడుదల చేస్తూనే వచ్చారు.

నిన్నటికి నిన్న ఒరేయ్ బుజ్జి గా మరియు నిశ్శబ్దం సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఆ రెండు సినిమాలు కూడా నిరాశ పరిచాయి.ఇంతకు ముందు వచ్చిన సినిమాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా నిరాశ పరచడంతో డిజిటల్ ఫ్లాట్ ఫాం ద్వారా వచ్చే సినిమాలు సక్సెస్ కావని సెంటిమెంట్ మరింతగా బలపడినట్లయింది ఈ కారణంగానే ఇకపై నేరుగా డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా సినిమాలు విడుదలయ్యే అవకాశం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దీనికి తోడు ఈ నెల 15 వ తారీకు నుండి థియేటర్ ల ఓపెన్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

ఆ కారణంగా డిజిటల్లో విడుదలకు ఫిల్మ్ మేకర్స్ ఆసక్తి చూపించే అవకాశం లేదని విశ్లేషకుల అభిప్రాయం.

అమెజాన్, ఆహా వంటి వెబ్ ప్లాట్ఫామ్ లు భారీ మొత్తాలకు సినిమాను కొనుగోలు చేస్తున్నప్పటికీ సక్సెస్ విషయంలో నిరాశ వ్యక్తం అవుతుంది.

అందుకే ఇకపై థియేటర్లలోనే తమ సినిమాలను విడుదల చేసే అవకాశం ఉంది థియేటర్లలో ఈ సినిమా విడుదల అయితే రెండు విధాలుగా బెన్ఫిట్ ఉంటుంది.

థియేటర్ల ద్వారా వచ్చే ఆదాయం మరియు డిజిటల్ రైట్స్‌ ద్వారా వచ్చే ఆదాయం వల్ల నిర్మాతలు రెండు విధాలుగా లాభాలు పొందవచ్చు.

ఆ కారణంగా మొదట థియేటర్లలో విడుదల చేసి ఆ తర్వాత ఓటీటీకి ఇవ్వాలని నిర్మాతలు మొదటి నుంచి భావిస్తున్నారు.

నేరుగా విడుదలవుతున్న సినిమాలు నిరాశ పర్చుతున్న కారణంగా ఇకపై రాబోతున్న సినిమాలు అన్నీ థియేటర్లలోనే అంటూ టాలీవుడ్ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పెసలతో వారానికి మూడు సార్లు ఇలా చేశారంటే పింపుల్స్ మళ్లీ ఈ వంక కూడా చూడవు!